నటుడు ధనుష్ తన సంస్థ వండర్‌బార్ ద్వారా, హీరోయిన్ నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్, రౌడీ పిక్చర్స్‌పై కేసు వేశారు. నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన నానుమ్ రౌడీ ధాన్ డాక్యుమెంటరీ విజువల్స్ ఉపయోగించడంపై మద్రాస్ హైకోర్టులో సివిల్ దావా వేశారు.
ఈ వివాదం కొద్ది రోజులుగా సాగుతోంది. ఎప్పటినుంచో నయనతారకు ధనుష్‌కు నడుమ ఏవో పాత పగలున్నాయి. అవేమిటో వాళ్లెవరూ బయటపెట్టలేదు గానీ… నేనూ రౌడీనే అనే సినిమాకు సంబంధించి ఇప్పుడు బయటపడ్డాయి… 10 కోట్లకు నయనతారకు నోటీసులు పంపించాడు కాపీరైట్స్ ఉల్లంఘన పేరిట.
నయనతార తన డాక్యుమెంటరీకి ఆ సినిమా క్లిప్స్ వాడతాను అంటే నిర్మాత ధనుష్ ఒప్పుకోలేదు. దాని దర్శకుడు నయనతార భర్త విఘ్నేశ్ శివన్. అందులో నయనతార నటించింది. నెట్‌ఫ్లిక్స్ కోసం బియాండ్ ద ఫెయిరీటేల్ పేరిట తన పెళ్లి, విశేషాలతో ఓ డాక్యుమెంటరీ చేసింది.
ఆ సినిమా బిట్స్ వాడుకోవడానికి ధనుష్ అంగీకరించలేదు. రెండేళ్లుగా అడుగుతోన్నా ధనుష్ బదులు ఇవ్వలేదు. షూటింగ్ సమయంలో తమ కెమెరాలతో తీసిన 3 సెకండ్ల బిట్ నయన్ వాడుకుంది. పదేళ్ల నాటి సినిమా కావటంతో పర్వాలేదు అనుకుంది. పైగా తను నటించిందే కదా అనే ధైర్యం.
చాన్నాళ్లుగా ధనుష్‌కు నయనతార అంటే కోపం. గతంలో ఫిలిమ్‌ఫేర్ అవార్డుల సమయంలో కూడా తన పగను, తన కోపాన్ని తన మాటల్లో బయటపెట్టాడని నయనతార అంటోంది. ఈ 10 కోట్ల నోటీసుపై కూడా కస్సుమంది. ఇంత దిగజారతావా అంటూ కడిగేసింది. ఈమేరకు సుదీర్ఘంగా ఓ నోట్ రిలీజ్ చేసింది. అది చదివితే ధనుష్‌దే తప్పు అనిపిస్తుంది.
ఇక్కడే అనుకోని మలుపు చోటు చేసుకుంది. ధనుష్ అభిమానులు సోషల్ మీడియాలో నయనతారకు గట్టిగా బదులిచ్చారు. సినిమా ప్రమోషన్స్ కు రాని నయన్… ఈ ఆంశంలో మాత్రం తను అమాయకురాలిని అన్నట్టుగా ప్రవర్తిస్తోందని ఘాటుగా విమర్శిస్తున్నారు. నయన్ ఒంటెత్తు పోకడలకు పోకుండా ధనుష్ తో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని సలహా ఇస్తున్నారు.