బాలీవుడ్ ఖాన్‌లో ఒకరైన ఆమిర్ ఖాన్ ప్రస్తుతం సినిమాలు తగ్గించేశారు. రీసెంట్‌గా వచ్చిన సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. దీంతో ఆయన కాస్త బ్రేక్ తీసుకున్నారు. అయితే తన 60 పుట్టిన రోజు సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల సందర్భంగా ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు రిలీజైంది. ఇందులో తాను సినిమాలు చేయకపోవడం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో సినిమాలు చూడాలంటే ఖచ్చితంగా థియేటర్‌కు వెళ్లాల్సి వచ్చేది. దాంతో బిజినెస్ జరిగేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు.. థియేటర్‌లో రిలీజైన తర్వాత రెండు నెలల్లో ఓటీటీలో ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నాం. దీంతో ప్రేక్షకులు థియేటర్‌కు రావడమే మానేశారు. దీంతో మన వ్యాపారాన్ని మనమే నాశనం చేసుకున్నాం.. ఇది ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు. అంతేకాదు సౌతిండియా మూవీస్ హిట్టు అవ్వడంపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు సినిమాలకు పెద్ద తేడా ఏమీ ఉండదని.. కానీ సౌతిండియా, బాలీవుడ్ మార్కెటింగ్ టెక్నిక్స్ వేరుగా ఉంటాయన్నారు. అందుకే సౌతిండియా సినిమాలు కోట్లు కొల్లగొడుతున్నాయని చెప్పారు.
నిజానికి ఆమిర్‌ఖాన్ ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. కానీ ఆయనలో మంచి యాక్టర్ ఉన్నారు. కానీ కథల సెలక్షన్‌లో తప్పు ఉందో.. ప్రజలు ఆయనను రిసీవ్ చేసుకోవడంలో తేడా ఉందో కానీ.. ప్రస్తుతం ఆయనకు అంత మంచి మార్కెట్ లేదన్నది వాస్తవం. ఆయనకు లేని మార్కెట్‌ను.. బాలీవుడ్ మార్కెట్‌కు లింక్ చేసి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు భిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.