28.7 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

బాలీవుడ్ హీరోతో శ్రీలీల డేటింగ్.. నిజమా? అబద్ధమా?

శ్రీలీల.. మోస్ట్ ఎనర్జెటిక్ యంగ్ హీరోయిన్. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సౌతిండియాలో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ శ్రీలీల. ఈ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. దీనికి కారణం ఇప్పుడు వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తుండటం.. కార్తీక్ ఇంట్లో జరిగిన ఓ వేడుకకు శ్రీలీల హాజరవ్వడం.. కార్తీక్ తల్లి తన కోడలిగా ఓ డాక్టర్‌ రావాలని కోరుకోవడం. ఈ విషయాలన్నింటిని కలిపి శ్రీలీల గురించే కార్తీక్ తల్లి మాట్లాడింది అంటూ ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

నిజానికి ఇలాంటి గాసిప్స్‌కు అడ్డు అనేది ఉండదు. ఎందుకంటే కార్తీక్ ఆర్యన్‌తో ఎవరూ నటించినా ఇలాంటి డేటింగ్‌ వార్తలు రావడం కామన్‌గా మారింది. గతంలో సారా అలీఖాన్‌తో కార్తీక్‌ డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వారిద్దరు కలిసి సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి.. రిలీజై కనుమరుగైనంత వరకు ఈ ప్రచారం జరుగుతూనే ఉంది. ఇది నిజమని నమ్మేలా వారిద్దరు కలిసి రెస్టారెంట్లకు వెళ్లడం.. కలిసి ఫోటోలకు ఫోజులివ్వడం.. దానిని చూసి కొన్ని సైట్లు కథనాలు వండి వార్చడం. ఇవన్నీ సినిమా ప్రమోషన్‌ స్ట్రాటజీస్‌ అనే వాదనలు కూడా లేకపోలేదు. సరిగ్గా ఇప్పుడు వీరిద్దరి సినిమా ప్రారంభం కాగానే మళ్లీ ఇలాంటి కథనాలు మొదలయ్యాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తేలాల్సి ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com