- భార్గవాస్త్రం ప్రయోగం సక్సెస్
- ద్రోణ్ మూకల దాడిని ఛేదించే కొత్త అస్త్రం
- ఒకేసారి కుప్పలుగా దూసుకొచ్చే ద్రోన్ ల నిర్వీర్యం
- రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో విరివిగా వినియోగం
- మన నగరాలపై దాడికి పాక్ ప్రయోగించినది కూడా ఇలాంటిదే
- రిమోట్ ఆపరేటెడ్ టాయ్ రీతిలో ఫంక్షనింగ్
- 2.5 కిలోమీటర్ల పరిధిలోని ద్రోన్లను ఛేదించే కౌంటర్ అస్త్రం
- ఎస్ డి ఏఎస్ ల్ సంస్థ రూపొందించిన హార్డ్ కిల్ టెక్నాలజీ
గగనతలంలో శత్రు దేశాల ద్రోన్లను పసిగట్టి నిర్వీర్యం చేసే సరికొత్త భార్గవాస్త్రాన్ని అధికారులు విజయవంతంగా ప్రయోగించారు.ఒడిసా గోపాల్ పూర్ లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరో స్పేస్ లిమిటెడ్ సంస్థ తయారు చేసిన ఈ అస్త్రం అతి తక్కువ వ్యయంతో ఉత్తమ ఫలితాలు రాబట్టే దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్రం.
ద్రోణ్ లపై నేటి కాలం బ్రహ్మాస్త్రం..
ఇప్పటి యుద్ధ కాలంలో శత్రు దేశాల ద్రోణ్ గుంపులు ఒకేసారి చొరబడి యుద్ధరంగంలో ఇబ్బందులు కలిగించడం నేటి యుద్ధరీతి. ప్రమాదకరమైన ఈ పోకడకు అడ్డుకట్ట వేయాలంటే భార్గవాస్త్రం సరిగ్గా పనిచేస్తుందని మన అధికారులు చెబుతున్న మాట.పైగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఈ అస్త్రాన్ని విస్తృతంగా ప్రయోగించారు. మన ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాల్లో మన ఆర్మీని నిరోధించడానికి ఉగ్రమూకల తరపున ఈ అస్త్రాన్ని పాకిస్థాన్ ఆర్మీ కూడా ప్రయోగించింది. భారత సరిహద్దు జిల్లాలు, నగరాలపై పాకిస్థాన్ ఈ రిమోట్ ఆపరేటెడ్ టాయిస్ ను కుప్పలు తెప్పలుగా ప్రయోగించింది. ఒక విధంగా చెప్పాలంటే ద్రోణ్ ల దాడి చేసింది.
నిర్దేశించిన పారామీటర్ల ప్రమాణాన్ని ఈ మైక్రో రాకెట్లు ఏ మాత్రం అందుకుని లక్ష్య సాధన చేస్తాయో అన్న ఉద్దేశంతో వీటిని ప్రయోగించి చూశారు. హార్డ్ కిల్ టెక్నాలజీ తో రూపొందిన ఈ అస్త్రం 2.5 కిలోమీటర్ల పరిధిలో చొరబడి దాడులకు వచ్చే ద్రోన్లను పసిగట్టి వాటిని విచ్ఛిన్నం చేసేస్తుంది.సీనియర్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారుల పర్యవేక్షణలో ఈ రాకెట్లను పరిశీలించారు.