-
వడోదరలో గురువారం రాత్రి దారుణమైన యాక్సిడెంట్
-
కారు ఢీకొని మహిళ మృతి
-
మరో మూడు వాహనాల వ్యక్తులకు గాయాలు
-
వారణాసి నుంచి వడోదర వస్తుండగా యాక్సిడెంట్
-
అతివేగమే యాక్సిడెంట్ కు కారణం
-
తప్పతాగి 120 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన డ్రైవర్
-
డ్రైవర్, ఓనర్ ఇద్దరూ స్టూడెంట్లే..
డ్రంక్ అండ్ డ్రైవ్ మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. వారణాసి నుంచి వస్తున్న ఒక కారు దానిముందు ఉన్న స్కూటర్ ను, మరో రెండు వాహనాలను అత్యంత వేగంగా ఢీ కొనడంతో ఒక మహిళ చనిపోగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయిపోయింది. 20 ఏళ్ళ యువకుడు వారణాసి నుంచి బయల్దేరి స్పీడుగా వస్తుండటంతో గుజరాత్ లోని వడోదరాలో ఈ ప్రమాదం జరిగింది.
సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ అత్యంత దారుణంగా, భీతి గొలిపేవిగా ఉన్నాయి.కారు నడిపిన డ్రైవర్ పూర్తిగా తాగి ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.ప్రమాదం జరిగే సమయానికి కారు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. డ్రైవర్ ఉత్తర ప్రదేశ్ లోని వారణాసికి చెందిన వాడని తెలుస్తోంది.యాక్సిడెంట్ జరిగి కారు నుజ్జు నుజ్జు అయిపోయిన తర్వాత అందులోంచి లేచిన డ్రైవర్ పూర్తిగా తాగిన మత్తులో కనపడ్డాడు. అనదర్ రౌండ్ అని అరుస్తూ కనిపించాడు.డ్రైవర్ పక్కన కారు ఓనర్ కూడా ఉన్నాడు. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ప్రమాదం గురువారం రాత్రి 12.30కి కరేలీ బాగ్ అనే ప్రదేశంలో జరిగింది. డ్రైవర్ వారణాసికి చెందిన 20 ఏళ్ల రక్షిత్ చౌరాసియా, వడోదర యూనివర్సిటీలో లా గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడని తెలుస్తోంది.కారు యజమాని మిత్ చౌహాన్ కూడా వడోదరకు చెందిన వాడేనని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్నాడని సమాచారం.యాక్సిడెంట్ జరిగిన వెంటనే డ్రైవర్ నుజ్జయిపోయిన కారులోంచి లేచి చేతులు గాల్లో ఊపుతూ అనదర్ రౌండ్ అని అరుచుకుంటూ రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత కొంత దూరం నడిచి ఓం నమశ్శివాయ అని ఉచ్ఛరించాడు.మరోవైపు కారు ఓనర్ కారు దిగి అక్కడనుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. యాక్సిడెంట్ తో తనకు సంబంధం లేదని, డ్రైవరే చేశాడని పెద్దగా అరుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
హోలీ రంగల కోసం వచ్చి మృత్యువాత :
కారు 120 కిలోమీటర్ల స్పీడులో దూసుకొస్తూ తమ వాహనం ముందున్న స్కూటర్ తో సహా మరో మూడు వాహనాలను ఢీకొంది. కారు స్పీడుకు స్కూటర్ నడుపుతున్న మహిళ, తన బిడ్డతో సహా ఎగిరి కొంత దూరాన పడి మరికొంత దూరం ఈడ్చుకు వెళ్లి పోయింది.తల్లి, బిడ్డ హోలీ రంగులు కొనడానికి సమీపంలోని షాపుకు స్కూటీపై వెడుతున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో తల్లి స్పాట్ లోనే చనిపోగా, బిడ్డను, మరో రెండు స్కూటర్ల కు చెందిన ముగ్గురిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆగ్రహించిన చుట్టు పక్కల జనం కారు డ్రైవర్ ను చితకబాదారు. ఇంతలో పోలీసులు వచ్చి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేయగా డ్రంక్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్ పూర్తిగా తప్పతాగి ఈ యాక్సిడెంట్ కు కారణమయ్యాడు. అతగాడి ఓనర్ కూడా తాగి ఉన్నాడా అన్న అంశాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే నిందితుల దగ్గర లైసెన్స్ ఉందని పోలీసులు తెలిపారు