పోలి పాడ్యమి సందర్భంగా దీపాల వెలుగుల కాంతులతో ఈ రోజు వేకువ జామునే విజయవాడలో కృష్ణా నది తీరం కళకళలాడింది. కార్తిక మాసం నెలరోజులు పుణ్య స్నానాలు చేసిన భక్తులు.. కార్తీక మాసం ముగింపు నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున భక్తులు పోలిని స్వర్గానికి పంపారు. నదీ స్నానమాచరించి ఆవు నేతిలో ముంచిన వత్తులను అరటిదొప్పలలో పెట్టి వెలిగించి, నదిలో విడిచిపెట్టారు.
కార్తిక మాసం నెలరోజులపాటు పుణ్యస్నానాలు చేసిన భక్తులు ఉదయమే నదీ తీరాలకు చేరుకుని భక్తి ప్రపత్తులతో పూజలు చేశారు. పోలి సందర్భంగా కిటకిటలాడిన భవానీ జల శంకర ఆలయం, పాత శివాలయం.. యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పొటెత్తారు.