తిరుమల తొక్కిసలాట దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారిన, 41మంది క్షతగాత్రులు కాగా వారందిరికీ చికిత్స అందిస్తున్నామని అందులో 21మందిని వైద్యులు డిశ్చార్జ్ చేశారని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. తొక్కిసలాటలో గాయపడి పదర్మావతి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న భక్తులను గురువారం ఈఓ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తొక్కిసాటకు కారణాలేంటనే విషయంపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. అక్కడ డ్యూటీలో ఉన్న డీఎస్పీ గేట్లు తెరవడం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ప్రాధమిక విచారణలో తేలినట్లు ఈఓ శ్యామలరావు చెప్పారు. అయితే పూర్తి స్ధాయి విచారణ తరువాతే ఒక నిర్ధారణకు వస్తామన్నారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నట్లు ఈవో తెలిపారు. స్విమ్స్ సూరింటెండెంట్ రవికుమార్ మాట్లాడుతూ క్షతగాత్రులందరికీ చికిత్స చేస్తున్నామని ఈ రోజు సాయంత్రానికి చాలా మందిని డిశ్చార్జ్ చేయనున్నట్లు వెల్లడించారు. ముగ్గురు క్షతగాత్రులకు మాత్రం మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుందని రవికుమార్ చెప్పారు.
- Advertisement with us -