23.7 C
Hyderabad
Monday, September 21, 2026

Live Video

spot_img

కార్గో షిప్ ని సీజ్ చెయ్యలేం

  • బియ్యం కంటైనర్లను మాత్రమే సీజ్ చెయ్యగలం
  • అన్ని అనుమతులు చెక్ చేసే లోడింగ్ కు అనుమతిస్తాం
  • స్టేక్ హోల్డర్లతో అవగాహనా సదస్సు నిర్వహించాం
  • విశాఖ కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్

కార్గో షిప్ లో పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే బియ్యం ఉన్న కంటైనర్ ను మాత్రమే సీజ్ చెయ్యగలమని షిప్ ని సీజ్ చెయ్యలేమని కష్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ విశాఖ రీజియన్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. అలాగే పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న సంస్ధలు, వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోగలం తప్పితే షిప్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేమని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతి అవుతోందని డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించినట్లు శ్రీధర్ తెలిపారు. పోర్టుకు వచ్చిన దేన్నైనా నేరుగా షిప్ లోకి లోడింగ్ చెయ్యమని ప్రతి వస్తువుకి, కనసైన్మెంట్ కి సంబంధించి అన్ని రకాల అనుమతి పత్రాలు ఉంటేనే షిప్ లో ఎక్కించడానికి అనుతిస్తామని కష్టమ్స్ అధికారి శ్రీధర్ వివరించారు. ఇదేవిధంగా బియ్యం రవాణా చెయ్యడానికి కూడా అన్ని అనుమతులు పరిశీలిస్తామని ఆయన స్పష్టం చేశారు. పోర్టుల నుంచి రవాణా అవుతున్న బియ్యంపై అనుమానాలు వస్తే వాటిని వెంటనే నిలిపివేస్తామని… అవి పీడీఎస్ బియ్యామా కాదా అని తెలుసుకోవాడానికి పరీక్షలుకు పంపితే 15 రోజుల తరువాత రిజల్ట్ వస్తుందని ఆయన చెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com