34.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర…కెటిఆర్

తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఘాటుగా స్పందించారు. విద్యార్థులకు నాసిరకం బోజనం పెడుతున్నారని ఆరోపించారు.

ఎక్స్ వేదికగా కెటిఆర్ విమర్శనాస్త్రాలు

ఇది కక్ష్యా ?
ఇది శిక్ష్యా?
ఇది నిర్లక్ష్యమా ?

పదేళ్లలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాల గౌరవం.. ఏడాదిలో ఎందుకు పడిపోయింది ?

గురుకులాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టే ప్రయత్నం చేస్తున్నారా ?

మండలానికి ఒక్క గురుకుల పాఠశాలకు మాత్రమే పరిమితం చేసే కుట్ర దాగి ఉందా ?

అందుకే ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రులలో అభద్రతా భావం పెంచుతున్నారా ?

ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?

ప్రతిష్ఠాత్మకంగా సీఎం నుండి మంత్రుల వరకు కామన్ డైట్ అంటూ అట్టహాసంగా ప్రారంభించింది ఆరంభ శూరత్వమేనా ?

కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శం

నేడు అంతులేని నిర్లక్ష్యం

విద్యార్థులు గురుకులాల నుండి పారిపోయే పరిస్థితికి కారణమెవ్వరు ?

https://x.com/KTRBRS/status/1873554932709908622?t=5Ku5eg38GQFMOKzbmlYMeg&s=08

ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని కెటిఆర్ విమర్శించారు. కామన్ డైట్ పేరుతో సీఎం, మంత్రులు చేసిన ప్రకటనలకు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేదని కెటిఆర్ మండిపడ్డారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com