ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(Disaster Management Organization) తెలిపింది. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది.
రేపు దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడే అవకాశం ఉంది. రానున్న 48 గంటల్లో తుఫాన్‌గా మారనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తెలిపింది. తుపాను ప్రభావంతో ఈ నెల 27, 28, 29 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.