27 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

కర్రె గుట్టల్లో ఎన్‌ కౌంటర్‌ 38 మది మావోయిస్టుల మృతి

మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా ఆంధ్ర, చత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతమైన కర్రె గుట్టలో భద్రతా దళాలకు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులను లక్ష్యం చేసుకుని ఐదు రోజుల పాటు కర్రెగుట్టల్లో భద్రతా దళాలు కూబింగ్‌ నిర్వహిస్తున్నాయి. కింత గుట్టల్లో భద్రతా దళాలు కూబింగ్ చేస్తుంటే పైన గగన తలంలో డ్రోన్లు, హెలీకాఫ్టర్లతో గస్తీ నిర్వహిస్తూ భద్రతా దళాలకు మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన దాడుల్లో దాదాపు 38 మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌ లో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. నిన్న శుక్రవారం నుంచి కర్రె గుట్టల్లో భద్రతా దళాలు మావోయిస్టుల వేటను ముమ్మరం చేశాయి. ఉదయం 7 గంటల నుంచే ఎయిర్‌ ఫోర్స్‌ కి చెందిన హెలీకాఫ్టర్లు కర్రె గుట్టలపైన చక్కర్లు కొట్టడం ప్రారంభించినట్లు స్థానికులు చెపుతున్నారు. శుక్రవారం రాత్రి పది గంటల వరకూ తుపాకులు, బాంబుల శబ్ధాలతో కర్రె గుట్టల పరిసరాలు దద్దరిల్లి పోయాయని అక్కడి పరిసర ప్రాంత ప్రజలు చెపుతున్నారు. కర్రెగుట్లను ఆవాసంగా చేసుకుని వందలాది మంది మావోయిస్టులు అక్కడ సంచరిస్తున్నట్లు నిఘా వర్గాల పక్కా సమాచారంలో పోలీసులు, భద్రతా దళాలు కూబింగ్‌ మొదలు పెట్టారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com