32.7 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

2025 – రాశిఫలాలు

ఓం గణేశాయనమః

మేషం…

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

అనుకున్నది సా«ధించాలన్న తపనతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. తకాలం పడిన కష్టం, కృషి ఫలిస్తుంది. కుటుంబసభ్యుల నుంచి ప్రోత్సాహం అందుతుంది. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. అయితే  నవంబర్, డిసెంబర్‌నెలలు కొంత అస్తవ్యస్తంగా ఉండవచ్చు.  రుణయత్నాలు చేస్తారు. ఇక కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఒక శుభవార్త లేదా వర్తమానం మరింత ఉత్సాహాన్నిస్తుంది. సోదరీలు, సోదరులతో సఖ్యత నెలకొంటుంది. అలాగే, భార్యాభర్తల మధ్య ఇంతకాలంగా ఎదురవుతున్న వివాదాలు సర్దుబాటు కాగలవు.బంధుమిత్రులతో ఇష్టాగోష్టి చర్చలు జరుపుతారు. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు మరింత ప్రోత్సాహం, నూతన పెట్టుబడులకు అవకాశాలు. రాజకీయవర్గాలు, కళాకారులు అనుకున్నది సాధిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలో కదలికలు ఉంటాయి. విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో విజయాలు, ర్యాంకులు సాధిస్తారు. క్రీడాకారులు మంచి గుర్తింపు పొందుతారు. జులై, అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ నెలలు అన్ని విషయాలలోనూ  అప్రమత్తంగా మెలగడం మంచిది. ఈకాలం ఆరోగ్య, కుటుంబసమస్యలు, మనోవేదన, ఇంటాబయటా ప్రతికూలత. అదృష్టసంఖ్య–9, ఆంజనేయస్వామిని పూజించండి.

వృషభం…

కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ముఖ్య కార్యక్రమాలు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. బంధువర్గంతో కొద్దిపాటి వివాదాలు నెలకొన్నా క్రమేపీ సర్దుబాటు కాగలవు. విలువైన వస్తువులు చేజారడం, మనశ్శాంతి లోపించడం వంటివి ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు కొంత విఘాతం కలిగే సూచనలు. ఆస్తి వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులు మీ పట్ల విధేయులై ఉంటారు. ఆర్థికంగా కాస్త ఊరట లభిస్తుంది. అయితే అదనపు ఖర్చులు మీదపడి రుణాలు చేస్తారు. సంఘంలో హోదా, గౌరవం పెరిగినా కుటుంబంలో చికాకులు తలనొప్పిగా మారతాయి. తీర్థయాత్రలు తరచూ చేస్తారు. కోర్టు కేసులలో కొంత వరకూ అనుకూలత ఉంటుంది. ఇళ్లు, వాహనాలు కొనుగోలు యత్నాలు నెమ్మదిగా కలిసివస్తాయి. వ్యాపారాలు, వాణిజ్యవర్గాలకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులు కోరుకున్న బదిలీలు పొందుతారు. అలాగే, విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, వైద్యరంగం వారు, ఐటీ ఉద్యోగులకు  ఊరట లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు కొత్త సంస్థల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తారు. క్రీడాకారులు, విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు.  జూన్, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, నెలలు ప్రతికూలం. ఈకాలంలో నిర్ణయాలలో తొందరవద్దు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. వివాదాలకు దూరంగా మెలగాలి. అదృష్టసంఖ్య –6. వీరు సూర్యారాధనలు, అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేయాలి.

మిథునం…

మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు

వీరు గతం కంటే మెరుగైన ఫలితాలు పొందే అవకాశం. పనులు చకచకా పూర్తి చేíసి ముందడుగు వేస్తారు. బంధువులతో కొద్దిపాటి విభేదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఇతరులకు చేతనైన సహాయం అందిస్తారు. భార్యాభర్తలు, సోదరీ,సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్‌ల వారికి అభివృద్ధి కనిపిస్తుంది. ఆశించిన రాబడి దక్కి ఉల్లాసంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాల నిర్వహణలోబిజీగా గడుపుతారు. ప్రముఖులు మీకు చేయూతనందిస్తారు. విద్యార్థులు కోరుకున్న ర్యాంకులు సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. ఆహారవిహారాదులలో తగు జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రత్యర్థులతో ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడబోరు. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో శుభపరిణామాలు. వ్యాపారాలు, వాణిజ్యవర్గాలకు లాభాలు. ఉద్యోగులు పదోన్నతులు, తద్వారా బదిలీలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులకు పట్టింది బంగారమే. కళాకారులు, రాజకీయవేత్తలకు సత్కారాలు జరుగుతాయి. మహిళలకు విజయాలు వరిస్తాయి.  జనవరి, మే, జులై, సెప్టెంబర్‌నెలలు కొంత చికాకు పరుస్తాయి. చోరభయం. మానసిక అశాంతి. ఇంటాబయటా కలహాలు వంటి ఫలితాలు కనిపిస్తాయి. అదృష్ట సంఖ్య.––5, వీరు నిరంతరం విష్ణుసహస్రనామ పారాయణ చేయడం మంచిది.

కర్కాటకం…

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

మీ కృషి, పట్టుదలతో ఎంతటి కార్యాన్నైనా సాధిస్తారు. అపురూపమైన వస్తువులు, వాహనాలు కొంటారు. రాబడి అనూహ్యంగా పెరిగి ఉత్సాహంగా అడుగేస్తారు. ప్రతిభావంతులుగా గుర్తింపు రాగలదు. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. సంతానరీత్యా పేరుప్రతిష్టలు ఇనుమడిస్తాయి. రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లు అనుకున్నది సాధిస్తారు. కొన్ని కేసుల నుంచి బయటపడే అవకాశం. కోపతాపాలు దరిచేరనీయవద్దు.  ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు లాభాలు కనిపిస్తాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. కళాకారులు, ఐటీ ఉద్యోగులకు అనూహ్యంగా కలసివస్తుంది,  ఊహించని అవకాశాలు. విద్యార్థులు, క్రీడాకారులకు  విజయాలు సిద్ధిస్తాయి.  ఫిబ్రవరి, జూన్, ఆగస్టు, అక్టోబర్, నెలలు ప్రతికూలంగా ఉంటాయి. ఈ కాలంలో ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి, అలాగే, ఎటువంటి హామీలు వద్దు. అదృష్ట సంఖ్య–2, వీరు వినాయకుని పూజలు చేయడం మంచిది.

సింహం…

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

వీరికి అంతా అనుకూలంగా కనిపించినా మధ్యలో కొన్ని చికాకులు తప్పవు. ఆర్థికంగా కొంత అనుకూలస్థితి ఉంటుంది. కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాలు, వాహనాలు కొనుగోలులో ముందడుగు వేస్తారు. ఆత్మీయులు, సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత కలవరపెట్టవచ్చు. కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్‌వర్గాలకు కలిసివచ్చే సమయం. వివాదాల నుంచి బయటపడతారు.వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు అనుకూల పరిస్థితులు. రాజకీయవేత్తలకు పదవీయోగం, విశేష ప్రజాదరణ పొందుతారు.  క్రీడాకారులు కొన్ని విజయాలు సాధిస్తారు. ఫిబ్రవరి, జులై, సెప్టెంబర్, నవంబర్‌ నెలలు ప్రతికూలంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. అదృష్టసంఖ్య–1, వీరు శివుని పూజలు చేయడం మంచిది.

కన్య…

ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు

అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. భార్యాభర్తల మధ్య వివాదాలు చాలావరకూ సర్దుబాటు కాగలవు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మరింత దగ్గరవుతారు. ఒక లేఖ లేదా సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో హౌదా, గౌరవం పెరుగుతాయి. కార్యోన్ముఖులై విజయాలు సాధించి అందర్నీ ఆకట్టుకుంటారు. సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులు అన్ని విధాలా సహకరిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు దక్కుతాయి. అగ్రిమెంట్లలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు అవార్డులు పొందుతారు. ఐటీ ఉద్యోగులు, వైద్యులకు హుషారుగా గడుస్తుంది. ఏప్రిల్, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, నెలలు ప్రతికూలం. వ్యవహారాలలో ప్రతిబంధకాలు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అదృష్ట సంఖ్య–5, వీరు నవగ్రహ ప్రదక్షణలు చేయడం ఉత్తమం.

తుల…

చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

వీరికి  ఎక్కువగా విజయాలే ఉంటాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. స్నేహితులు, బంధువుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. వివాదాలు, కేసుల నుంచి చాలవరకూ బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. మీ అభిమానం, ఆప్యాయతలతో అందర్నీ మెప్పిస్తారు. ఆర్థికంగా గతంతో పోలిస్తే మెరుగైన పరిస్థితి ఉంటుంది. కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్‌ల వారికి అనూహ్యమైన రీతిలో అభివృద్ధి ఉంటుంది. ప్రత్యర్థులు సైతం మీ అభిప్రాయాలను మన్నించడం విశేషం. విద్యార్థులు, క్రీడాకారులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది.  ముఖ్య వ్యవహారాలలో ఒప్పందాలు, చర్చలు అనుకూలిస్తాయి. వ్యాపారులు, వాణిజ్యవర్గాల కృషి ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు. ఐటీ ఉద్యోగులు, వైద్యులు, రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి.  సంతాన ఆరోగ్యాలపై ఆదుర్దా చెందుతారు. మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తులు సమకూరతాయి.   ఏప్రిల్, మే, ఆగస్టు, నవంబర్‌ నెలలు ప్రతికూలం. ఈకాలంలో అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మాటల సందర్భాలలో జాగ్రత్త అవసరం. విరోధాలు పెరుగుతాయి. అదృష్ట సంఖ్య 6. వీరు శ్రీగురుదత్తాత్రేయుని స్తోత్రాలు పఠించడం, పూజలు చేయడం మంచిది.

వృశ్చికం…

విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట

ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న ప్రముఖుల నుంచి ముఖ్యసందేశం అందుతుంది. అదనపు రాబడి ఉత్సాహాన్నిస్తుంది., రావలసిన సొమ్ము సైతం అందుతుంది. బంధువర్గంతో చర్చలు ఫలప్రదమవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలుతీసుకుంటారు. మీపై మోపిన అభియోగాలు సమసిపోతాయి. విద్యార్థులు ఊహించని అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. మధ్యమధ్యలో ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. మీ నిర్ణయాలు కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడే అవకాశం. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. రాజకీయవేత్తలు, కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కాంట్రాక్టర్లు అనుకున్న పనులు చేజిక్కించుకుంటారు. ఐటీ ఉద్యోగులు, క్రీడాకారులు గుర్తింపు పొందుతారు. వాహన, కుటుంబసౌఖ్యం.  మే, జూన్,అక్టోబర్, డిసెంబర్‌ నెలలు ప్రతికూలం. ఈ కాలంలో ప్రతి విషయంలోనూ ప్రతిబంధకాలు, వివాదాలు. మానసిక అశాంతి వంటి ఫలితాలు ఉంటాయి. అదృష్టసంఖ్య–9, వీరు ప్రతి శనివారం రావివేపచెట్టు చుట్టూ 11చొప్పున ప్రదక్షణలు చేయడం ఉత్తమం.

ధనుస్సు…

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

పతి విషయంలోనూ కొంత అప్రమత్తత అవసరం. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి కొంత సహాయసహకారాలు ఉంటాయి. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య వివాదాలు కొంతవరకూ పరిష్కారమవుతాయి. మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తత అవసరం. విద్యార్థులు మరింత ఓపిక, సహనంతో మెలగాలి. అలాగే పట్టుదల పెంచుకుంటే మంచిది. ఇంటి నిర్మాణాలు కొలిక్కి వస్తాయి. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. రావలసిన బాకీలు కొంతమేరకు అందుతాయి. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు సానుకూలం. క్రీడాకారులకు ద్వితీయార్ధంలో శుభవార్తలు. విజయాలు. వీరికి మార్చి, జూన్, జులై, నవంబర్‌నెలలు ప్రతికూలం. ఈ కాలంలో ధననష్టం. కుటుంబంలో సమస్యలు. మానసిక ఆందోళన. అదృష్ట సంఖ్య–3, వీరు ప్రతి నిత్యం దత్తాత్రేయ స్తోత్రాలు పఠించాలి.

మకరం…

ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

ఎటువంటి నిర్ణయమైనా వెంటనే తీసుకుంటారు. రాబడి మరింతగా పెరుగుతుంది. మీ స్పందనలు ఇతరుల మెప్పు పొందుతాయి. కార్యక్రమాలలో జాప్యం లేకుండా పూర్తి కాగలవు. ఆలోచనలు తక్షణం అమలు చేసి చురుగ్గా వ్యవహరిస్తారు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి.  సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆస్తుల విషయంలో తుది ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ర్యాంకులు దక్కుతాయి. వాహనాలు,గృహం కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్‌వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. భార్య తరఫు నుంచి అనూహ్యంగా ఆస్తిలాభం. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు అనుకూల ఫలితాలే. పెట్టుబడులు సైతం అందుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు కృషి ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలు, ఐటీ ఉద్యోగులు కొన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. క్రీడాకారులకు నూతనోత్సాహం. వీరికి ఏప్రిల్, జులై, ఆగస్టు, డిసెంబర్‌నెలలు ప్రతికూలమైనవి. ఈకాలంలో లేనిపోని విభేదాలు. మానసిక అశాంతి. శారీరక రుగ్మతలు వంటి ఫలితాలు ఉంటాయి. అదృష్టసంఖ్య–8, వీరు శ్రీరాముని పూజించడం మంచిది.

కుంభం…

ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

వీరికి  ఆర్థికంగా పురోగతితో పాటు, హఠాత్తుగా ధనలాభాలు కలుగుతాయి. వ్యవహారాలలో ఎల్లప్పుడూ ముందడుగు వేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రముఖుల నుంచి సందేశాలు అందుతాయి. అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. భార్యాభర్తల మధ్య ఎన్నడూ లేనంత ప్రేమానురాగాలు కలుగుతాయి. ఆస్తుల విషయంలో వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలే ఉంటాయి. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు సంతోషకరమైన సమాచారం. లాభాలు అందుతాయి. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు అనుహ్యమైన రీతిలో ప్రగతి ఉంటుంది. ఐటీ ఉద్యోగులు, కళాకారులకు తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. క్రీడాకారులు, రియల్‌ఎస్టేట్‌వర్గాలకు ఊహించని విధంగా అభివృద్ధి కనిపిస్తుంది. వీరికి  మార్చి, మే, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలు ప్రతికూలం. ఈకాలంలో ఈతిబాధలు, మనోధైర్యం తగ్గుదల, అనారోగ్య సూచనలు. అదృష్ట సంఖ్య–8, వీరు ప్రతి శుక్రవారం దుర్గామాతకు కుంకుమార్చన చేయడం మంచిది.

మీనం…

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఎంతటి పనులైనా ఇతరుల సహాయం లేకుండా పూర్తి చేయలేరు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగానే ఉంటాయి. భవిష్యత్తుపై కొంత ఆందోళన నెలకుంటుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆరోగ్యపరమైన చికాకులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు ఎదురవుతాయి. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలకులోటు ఉండదు. కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్‌ల వారికి చెప్పుకోతగ్గ ప్రగతి కనిపించినా కొంత ఆందోళన సైతం తప్పదు. వివాహా యత్నాలు ఫలిస్తాయి. కొందరికి నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు అనూహ్యమైన లాభాలు అందుతాయి. పారిశ్రామిక,రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వీరికి  ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, అక్టోబర్‌ నెలలు ప్రతికూలం. ఈ కాలంలో వ్యయప్రయాసలు. విరోధాలు. చోరభయం వంటి ఫలితాలు ఉంటాయి. అదృష్టసంఖ్య–3, వీరు ఏకాగ్రతతో నిత్యం గణేశ్‌స్తోత్రాలు పఠిస్తే మంచిది.

సింహంభట్ల సుబ్బారావు

6300674054

 

 

 

 

 

 

 

 

 

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com