ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉండి టీమిండియా పరువు కాపాడుతున్న జస్ప్రిత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫి ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడనుంది. ఇందులో ఐదు టీ20లు ఉండగా.. మూడు వన్డేలు ఉన్నాయి. ఇంగ్లండ్ మొత్తం సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉండడని తెలుస్తోంది. అయితే చాంపియన్స్ ట్రోఫిలో బుమ్రా సేవలు అవసరం ఉంటాయి కాబట్టి.. అతడికి రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం టీమ్‌తో మాట్లాడిన తర్వాత ఫైనల్ కానుంది.
జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఈ సిరీస్ జరగనుంది. చాంపియన్స్ ట్రోఫి ప్రారంభమవడానికి సరిగ్గా ఏడు రోజుల ముందు ఇంగ్లండ్ సిరీస్ ముగియనుంది. ప్రస్తుతం ఇండియన్ పేస్ అటాక్‌ను లీడ్ చేస్తున్నాడు బుమ్రా. మహ్మద్ షమీ గాయం కారణంగా ప్రస్తుతం మ్యాచ్‌లు ఆడకపోతుండటంతో బుమ్రా, సిరాజ్‌లపై తీవ్ర భారం పడింది. సిరాజ్ కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నాడు కానీ.. ఎక్కువ భారం మాత్రం బుమ్రాపైనే పడుతున్నట్టు కనిపిస్తోంది.
మెల్బోర్న్ టెస్ట్‌లో బుమ్రా ఒక్కరోజే 53.2 ఓవర్లు వేశాడు. మొత్తం నాలుగు టెస్టుల్లో ఇప్పటి వరకు 141.2 ఓవర్లు వేశాడు. ఇది మాములు విషయం కాదు. ఈ లెక్కలే చెబుతున్నాయని తనపై ఎంత స్ట్రెయిన్ పడుతుందో చెప్పడానికి. ఈ స్థాయిలో బౌలింగ్ వేసిన ప్లేయర్ ఇటు భారత్‌లో, అటు ఆస్ట్రేలియాలో ఎవరూ లేరనే చెప్పాలి. అంతేకాదు ఇప్పుడు సిడ్నీ టెస్ట్‌లో కూడా బుమ్రా బౌలింగ్‌పైనే టీమ్ ఇండియా ఆశలు పెట్టుకుందనే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సిడ్నీ టెస్ట్ కూడా ఆడితే కేవలం నాలుగు నెలల్లో ఏకంగా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడినవాడవుతాడు బుమ్రా. ఇంత కష్టపడుతున్నాడు కాబట్టే.. సెలెక్టర్లు అతడికి ఓ సిరీస్‌లో రెస్ట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు.
ఇండియా vs ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్
జనవరి 22, బుధవారం, కోల్‌కతా, 1st T20
జనవరి 25, శనివారం, చెన్నై, 2nd T20
జనవరి 28, మంగళవారం, 3rd T20, రాజ్‌కోట్
జనవరి 31, శుక్రవారం 4th T20, పూణె
ఫిబ్రవరి 2, ఆదివారం, 5th T20, ముంబై
ఫిబ్రవరి 6, గురువారం, నాగ్‌పూర్ 1st ODI
ఫిబ్రవరి 9 ఆదివారం, కటక్, 2nd ODI
ఫిబ్రవరి 12, బుధవారం, అహ్మదాబాద్, 3rd ODI