దాడికి ఆయుధాలు సిద్ధమన్న డ్రాగన్ కంట్రీ..
సై అంటే సై.. దేనికైనా రెడీ అంటోంది చైనా. అమెరికాతో జరుగుతున్న ట్రేడ్ వార్‌లో పైచేయి సాధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ట్రంప్ ఇప్పటి వరకు వార్నింగ్ ఇచ్చినట్టుగా నిజంగానే చైనాపై 50 శాతం టారిఫ్‌లు పెంచారు. దీంతో చైనాపై 104 శాతానికి చేరాయి టారిఫ్‌లు. దీంతో డ్రాగన్ కంట్రీకి షాక్ తగిలినట్టైంది. అంతేకాదు ఈ పెంచిన టారిఫ్‌లు వెంటనే అమల్లోకి వచ్చాయి కూడా.
మాములుగా అయితే చైనాపై 10 శాతం టారిఫ్‌లు ఉండేవి. దానిని 54 శాతానికి తీసుకొచ్చారు ట్రంప్. ఇప్పుడు ఏకంగా 50 శాతం పెంచడంతో అది 104 శాతానికి చేరాయి. దీంతో ట్రేడ్ వార్ పీక్స్‌కు చేరిందనే చెప్పాలి.
అమెరికా టారిఫ్‌లపై అదే స్థాయిలో స్పందించింది చైనా. తాము ఈ పరిస్థితులను ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. వీటన్నంటిని ఎదుర్కోనేందుకు ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయంది. యూరప్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డిర్‌తో చైనా ప్రతినిధి మాట్లాడారు. అమెరికా చేసే బ్లాక్‌మెయిల్ చేస్తోంది.. దీనిపై పోరాడుతామే తప్ప లొంగిపోయేది లేదని తెలిపిది. అమెరికా ఏకపక్షంగా తన భాగస్వామ్యులపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోందంటూ ఫైర్ అవుతోంది చైనా.
ట్రంప్ తీరును తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది చైనా. తాము తమ స్వప్రయోజనాలను కాపాడుకుంటామని.. అదే సమయంలో అంతర్జాతీయ వాణిజ్య నిబంధలను కూడా కాపాడేందుకు పోరాడుతామంది. నిజానికి చైనా ఇలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వడం వెనక వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోంది. ట్రంప్ తీరుతో అమెరికాకు దూరమవుతున్న వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది చైనా. ఇప్పటికే ట్రంప్‌పై యూరప్ దేశాలతో పాటు బ్రిటన్ కూడా గుర్రుగా ఉంది. మరి జియోపాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి.