ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు హదరాబాద్ వచ్చారు. సోమవారం ఉదయమే ఒంగోలు రూరల్ పోలీసులు జూబ్లీహిల్స్ లోఉన్న ఆర్జీవీ డెన్ కు చేరుకున్నారు. ఈరోజు ఒంగోలు రూరల్ పీఎస్ లో ఆర్జీవీ విచారణకు రాకపోవడంతో ఆయన్ను అరెస్ట్ చేసి ఒంగోలు తరలించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. గతంలో ఆర్జీవీ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లను కించపరిచేలా పలు సామాజిక మాధ్యమాల్లో వర్మ పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారంపై ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ నాయకుడు కేసు పెట్టడంతో దాని ఆధారంగా నవంబర్ 19వ తేదీ విచారణకు రమ్మని వర్మకు ఒంగోలు పోలీసులు నోటీసు ఇచ్చారు. అయితే ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున తాను హాజరు కావడానికి నాలుగు రోజులు గడువు కావాలని మద్దపాడు పోలీసులకు వర్మ వాట్సప్ సందేశం పంపారు. దీంతో 25వ తేదీన విచారణకు హాజరుకావాలని మరోసారి వర్మకు నోటీసులు ఇచ్చారు. అయితే వర్మ విచారణకు హాజరు కాకపోవడంతో ఆయన్ను అరెస్ట్ చెయ్యడానికి ఒంగోలు రూరల్ పోలీసులు సోమావారం హైదరాబాద్ వచ్చారు.
రామ్ గోపాల్ వర్మ అందుబాటులో లేరని సినిమా షూటింగ్ నిమిత్తం రాష్ట్రం వెలుపల ఉన్నట్లు ఆయన సిబ్బంది పోలీసులకు తెలిపారు. మరో వైపు వర్మ న్యాయవాది మీడియా ముందుకు వచ్చి విచారణకు సహకరిస్తామని కానీ కొద్ది రోజులు సమయం కావాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. సినిమా షూటింగుల నిమిత్తం వేరే ప్రాంతంలో ఉన్నందున వర్చువల్ విచారణకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరినట్లు వర్మ లాయర్ తెలిపారు. అయితే పోలీసులు మాత్రం విచారణకు హాజరుకాని వర్మను అరెస్ట్ చెయ్యడానికే సిద్దమవుతున్నారు.
రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కు వచ్చిన ఏపీ పోలీసుల
- Advertisement with us -