ఎన్నో విమర్శలు.. ఈ ఏడాదిలో ఒక్క సెంచరీ కూడా చేయలేదన్న సెటైర్లు.. BGT సిరీసే ఇక ఆఖరి.. అతని సత్తా అయిపోయింది.. ఇలా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తోనే అందరికి సమాధానం ఇచ్చేశాడు. పెర్త్ టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో 143 బంతుల్లో కోహ్లీ సెంచరీ బాదేశాడు. 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో విరాట్ కోహ్లీ ఈ సెంచరీ సాధించాడు. 2023లో వెస్టిండీస్‌లో భారత పర్యటనలో విరాట్ కోహ్లీ అద్భుతమైన టచ్‌లో కనిపించాడు. అతను మొదటి టెస్టులో 76 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో టెస్ట్ సెంచరీని సాధించి డాన్ బ్రాడ్‌మాన్ టెస్ట్ సెంచరీల రికార్డును సమం చేశాడు. ఇది కోహ్లికి 81వ అంతర్జాతీయ సెంచరీ. టెస్టుల్లో 30వ సెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు.
సెంచరీ మాత్రమే కాదు.. తన బ్యాటింగ్ స్టైల్‌తో మరోసారి మెస్మరైజ్ చేశాడు కోహ్లీ. అనూహ్యమైన బౌన్స్‌తో బౌలర్లు ఇబ్బంది పెడుతున్నా కోహ్లీ తన మాస్టర్ క్లాస్ ఆటతో వారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. స్టార్క్ బౌలింగ్‌లో అప్పర్ కట్ షాట్‌తో సిక్స్, కమిన్స్ బౌలింగ్‌లో తన ట్రేడ్ మార్క్ ఆఫ్ డ్రైవ్‌తో ఆకట్టుకున్నాడు. స్పిన్నర్ లైయన్‌ను స్వీప్ షాట్లతో నిలువరించాడు. ఇలా ఆచి తూచి ఆడుతూ.. పరుగుల వరద పారిస్తూ 81వ సెంచరీ చేసేశాడు కోహ్లీ.