టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మనసులో మాట బయట పెట్టేశాడు. ఛాంపియన్స్ ట్రోఫి గెలవడం వెనక రీజన్ కూడా చెప్పేశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఓ ఈవెంట్ జరిగింది. ఈ స్టేడియం 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఘనంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, రహానే, శ్రేయస్ అయ్యర్, శార్దూల్, యశస్వితో పాటు అనేక మంది మాజీ క్రికెటర్లు.. పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరు క్రికెట్ గురించి, వాంఖడేతో తమకున్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు.
వాంఖడే గురించి చెబుతూనే ఛాంపియన్స్ ట్రోఫి గురించి కూడా మాట్లాడాడు రోహిత్. ఛాంపియన్స్ ట్రోఫి గెలవాలి.. ఆ ట్రోఫితో వాంఖడేలో వేడుకలు చేసుకోవాలన్నారు. ఇదే తన కొరిక అన్నాడు రోహిత్. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారగా కోలాహాలంగా మారింది. తనకు వీలైనంత వరకు ట్రోఫీ గెలిచేందుకు ప్రయత్నిస్తానన్నాడు. ఐసీసీ ట్రోఫీ గెలవడం ఒక గొప్ప అయితే.. దాన్ని తీసుకొని ప్రజలతో సెలబ్రేట్ చేసుకోవడం మరో గొప్ప విషయమన్నాడు రోహిత్. 140 కోట్ల మంది మా వెనక ఉన్నారని.. అదే తమ బలమని.. అదే బలంతో దుబాయ్‌కు వెళ్లి కప్‌ను గెలిచేందుకు ప్రయత్నిస్తామన్నాడు రోహిత్.