ఖోఖోలో మనోళ్లు కేక పుట్టించారు. మనల్ని ఎవడ్రా ఆపేది అనే రేంజ్లో రెచ్చిపోయారు. తొలిసారి జరిగిన ఖోఖో వరల్డ్ కప్పులు భారత్ సొంతమయ్యాయి. అటు ఉమెన్స్ టీమ్.. ఇటు మెన్స్ టీమ్ తమ సత్తా చాటాయి. ఫైనల్స్‌లో నెగ్గి రెండు టీమ్‌లు వరల్డ్ కప్పులు సాధించాయి. ఇక్కడ హైలేట్ ఏంటంటే ఇరు టీమ్స్ కూడా ఫైనల్స్‌లో నేపాల్‌తో పోటీ పడి గెలవడం.
ఢిల్లీ వేదికగా నేపాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మెన్స్ టీమ్ విజయం సాధించింది. 54-36 తేడాతో నేపాల్ టీమ్‌ను భారత్ చిత్తు చేసింది. తొలి రౌండ్లో 26–18 అధిక్యతతో నిలబడిన భారత్ అదే జోరును చివరి వరకూ కొనసాగించింది. తొలి టర్న్‌లో 28 పాయంట్లు.. రెండో టర్న్‌లో 18 పాయింట్లు.. మూడో టర్న్‌లో ఫుల్ అటాక్ మోడ్‌లోకి వచ్చిన మెన్స్ టీమ్ 28 పాయింట్లు సాధించింది. దీంతో మెన్స్ టీమ్ విజయం ఖాయమైంది.
ఇక మహిళల టీమ్ అయితే దుమ్ము దులిపేసిందనే చెప్పాలి. మొదటి నుంచి అటాకర్లు విజృంభించారు. తొలి టర్న్‌లోనే 34 పాయింట్లతో ఆధితక్యంలో ఉన్నారు. అయితే రెండో టర్న్‌లో మాత్రం 35-24కు ఆధిక్యం తగ్గింది. కానీ మూడో టర్న్‌లో మరోసారి పుంజుకుంది టీమ్ ఇండియా. మరో 38 పాయింట్లను సాధించారు. నాలుగో టర్న్ ప్రారంభమయ్యే సరికి ఏకంగా 49 పాయింట్ల ఆధీక్యంలో నిలివడంతో ఇక నేపాల్ చెతులెత్తేసింది. దీంతో 78-40 పాయింట్ల తేడాతో విక్టరీ సాధించింది ఉమెన్స్ టీమ్.