28.2 C
Hyderabad
Friday, October 23, 2026

Live Video

spot_img

భారత, రష్యా దేశాల మధ్య మెగా డిఫెన్స్ డీల్

భారత, రష్యా దేశాల మధ్య భారీ రక్షణ ఒప్పందంపై చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం రష్యాపర్యటనలో ఉన్నరక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ దీనిపై రష్యా రక్షణ మంత్రితో చర్చలు జరుపుతున్నారు. ఈ మెగా రక్షణ ఒప్పందం వర్కవుట్ అయితే భారత్ గగన తల ఆయుధ సంపత్తి ఒక్కసారిగా అమాంతం పెరగనుంది.రూ.4 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఈ అతిపెద్ద మెగా డీల్ పై చర్చలు కీలక దశకు చేరుకున్నాయి.
ఒరొనేజ్ రాడార్.. క్షిపణుల రాకను ముందే గుర్తించే వ్యవస్థ…
యాంటి ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ వ్యవస్థను, రాడార్లను రూపొందించడంలో దిట్ట అయిన అల్మాజ్ యాంటే కార్పొరేషన్ తాజాగా ఒరొనేజ్అనే అత్యాధునిక రాడార్ల సీరీస్ ను డెవలప్ చేసింది.రాడార్లలోనే అత్యాధునికమైన ఈ రాడార్ వ్యవస్థ 8వేల కిలోమీటర్ల పరిధిలోని ఏ ఆబ్జెక్ట్ నయినా ముందే గుర్తించగలదు. బాలిస్టిక్ క్షిపణులు, ఫైటర్ జెట్లు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల రాకను చాలా ముందే గుర్తించగలదు. ఈ రాడార్ చైనా భూ భాగంపైనుంచి ఎక్కడనుంచైనా, లేదా దక్షిణ మధ్యఆసియాలో ఏమూల నుంచి క్షిపణి ప్రయోగం జరిపినా చాలా ముందే గుర్తిస్తుంది. ఇక హిందూ మహాసముద్ర తీర ప్రాంతంపై అంగుళం అంగుళం ఈ రాడార్ వ్యవస్థ పరిధిలో కనిపిస్తుంది. దాదాపు 500 ఆబ్జెక్టులను ఒకే సారి గుర్తించే సమర్దత కలిగిన ఈ రాడార్ 8 వేల కిలోమీటర్ల పొడవు, 6వేల కిలో మీటర్ల వెడల్పు పరిధిలో దేనినైనా గుర్తిస్తుంది.8వేల కిలోమీటర్ల ఎత్తులో ఉండే వస్తువులను సైతం సులభంగా గుర్తించే ఈ రాడార్ బాలిస్టిక్, ఖండాంతర క్షిపణులను ఇట్టే గుర్తిస్తుంది. అలాగే అంతరిక్షంలో భూమికి సమీపంగా వస్తున్న ఆస్టరాయిడ్లను కూడా గుర్తించగలదు. ఈ సాంకేతిక పరిజ్నానాన్ని భారత్ కు బదలాయించుకుని మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద ఈ హై రేంజ్ రాడార్లను నిర్మించుకోవాలని భారత్ చూస్తోంది. అంటే రాడార్ తయారీలో 60 శాతం దేశీయ పరిజ్నానంతోనే రూపొందిస్తారు. ప్రస్తుత చర్చలు ఫలిస్తే ఆ టెక్నాలజీ మనకు అందుతుంది. అల్మాజ్ యాంటే కార్పొరేషన్ కు చెందిన టెక్నిల్ టీమ్ కూడా భారత్ కు వచ్చి ఇక్కడి పార్ట్ నర్లతో చర్చలు జరిపింది.
కర్ణాటకలోని చిత్రదుర్గలోనే..
ఈ డీల్ గనక కుదిరితే రాడార్ల వ్యవస్థని కర్ణాటకలోని చిత్రదుర్గలో ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే స్థల పరిశీలన కూడా జరిగిపోయింది. చిత్ర దుర్గలో ఇప్పటికే అత్యాధునిక రహస్య రక్షణ వ్యవస్థలు ఉన్నాయి.కొన్ని కీలక అంతరిక్ష రంగ పరిశోధనలు కూడా అక్కడ జరుగుతున్నాయి. ఈ రాడార్ వ్యవస్థని ఒకసారి ఏర్పాటు చేస్తే మనదేశానికి ప్రత్యర్దులనుంచి ఎదురయ్యే ముప్పును ముందే గ్రహించవచ్చు. భారత సముద్ర తీరాల పై పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. దక్షిణాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ వ్యాప్తంగా తలెత్తుతున్న సవాళ్ల నేపధ్యంలో ఈ టెక్నాలజీ భారత్ సమకూర్చుకోవడం ఎంతో అవసరం. భారత, రష్యా దేశాలు ప్రత్యేకమైన వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం పై ఎప్పటినుంచో కసరత్తు చేస్తున్నాయి. వీటితో పాటు అత్యాధునిక ఎస్4 క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందంపై కూడా భారత్ ఇప్పటికే సంతకం చేసింది. ఇరు దేశాల రక్షణ మంత్రుల చర్చలు ఫలించి డీల్ కుదిరితే చైనాకు దీటుగా అబేధ్యమైన రక్షణ వ్యవస్థను రూపొందించుకోవడంలో మనం విజయం సాధించినట్లే..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com