24.5 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

తిలక్ వర్మ తడాఖా.. టీమిండియా విక్టరీ

చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. దాదాపుగా ఓటమి అంచుకు చేరుకున్న టీమ్‌ను ఒంటిచెత్తో గెలిపించాడు తెలుగు బిడ్డ తిలక్ వర్మ. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో2-0 లీడ్‌కు చేరుకుంది.

నిజానికి చెన్నై టీ20 ఓ థ్రిల్లింగ్ మ్యాచ్‌ అని చెప్పాలి. 166 పరుగుల టార్గెట్‌ను చేధించేందుకు ఈసారి బ్యాట్స్‌మెన్లు కష్టపడ్డారు. ఓపేనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లతో పాటు సూర్యకుమార్ యాదవ్ వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆదిలోనే కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్, హార్ధిక్ పాండ్యా కూడా పరుగులు తీయలేకపోయారు. ఒకానొక దశలో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇలా ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు వర్మ. 55 బంతుల్లో 72 పరుగులు చేశాడు వర్మ. మరో ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ కూడా వర్మకు తోడాయ్యాడు. కీలకమైన 26 పరుగులు చేయడంతో విక్టరీ ఈజీ అయ్యిందనే చెప్పాలి. 19.2 ఓవర్లలోనే 165 పరుగుల టార్గెట్‌ను చేధించింది టీమ్ ఇండియా.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్ టీమిండియా ముందు గౌరవప్రదమైన స్కోర్‌ను ఉంచారు. 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేశారు. బట్లర్ 45.. స్మిత్ 22.. బ్రైడాన్ కార్సే 31 పరుగులు చేయడంతో 165 పరుగులు చేసింది ఇంగ్లండ్. ఇక వరుణ్ చక్రవర్తి, అక్షర్‌ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా.. అర్షదీప్, పాండ్యా, సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ తీశారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com