నిరుద్యోగ యువతలో ప్రతిభ నైపుణ్యాలు పెంపొందించడానికి వీలుగా టాస్క్ శిక్షణ ఇస్తారని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శనివారం ములుగు జిల్లా కేంద్రములో టాస్క్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించిన మంత్రి సీతక్క. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ టాస్క్ లో శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత టాస్క్ వల్లే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వెనుకబడిన ములుగు జిల్లా లో ఉన్న గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశమని తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసుకున్న వారి నుండి పై చదువులు చదివిన వారికి కూడా ఇందులో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు పొందవచ్చని వివరించారు.
అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే కష్టం ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. తాము కూడా మారుమూల గ్రామం పక్కనే వున్న జగ్గన్న పేట గ్రామము నిరుపేద కుటుంబం లో పుట్టి పదవ తరగతి వరకు ములుగులోని ప్రభుత్వ పాఠశాలలో చదివానని తెలిపారు. తరువాతి కాలంలో ఉద్యమాల బాటపట్టి మళ్లీ బయటకు వచ్చి చదువుతోనే సమాజములో విలువ అని తెలుసుకొని రాజకీయంగా ఓడిన గెలిచిన చదువు వదలకుండా PHD పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. ఈ మధ్య అనేక పరిణామాలు చోటు చేసుకున్న మొక్కవోని దీక్షతో పని చేస్తున్నా మీరు కూడా కష్టానికి అలవాటు పడాలి.. కష్ట పడితేనే విజయం స్వంతం అవుతుంది.
ములుగు జిల్లాలోని యువతి యువకులు టాస్క్ ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకరా ఐఏఎస్,టాస్క్ ఆఫీసర్ లు మరియు జిల్లా గ్రంధాలయం సంస్థAll Posts చైర్మన్ బానోత్ రవి చెందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరుద్యోగ యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు