37.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

జాతీయ జెండాకు ప్రధాని మోడీ వందనం

గణతంత్ర దిోత్సవ వేడుకల్లో భారతదేశ ప్రధాని మోడీ పాల్గొన్నారు. 76 వ భారత రిపబ్లిక్ డే సంధర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి సెల్యూట్ చేశారు.

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ శిబిరంలో మొత్తం 2361 మంది ‘ఎన్‌సిసి’ కేడెట్లు పాల్గొనగా, వీరిలో 917 మంది బాలికలు కూడా ఉన్నారు. ఇప్పటివరకు బాలికలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్న వేడుకలు ఇవే కావడం గమనార్హం. ప్రధానమంత్రి ర్యాలీలో ఈ కేడెట్లందరూ పాల్గొనడం ద్వారా న్యూఢిల్లీలో నెల రోజులపాటు సాగిన ‘ఎన్‌సిసి’ గణతంత్ర దినోత్సవ శిబిరం 2025 విజయవంతంగా ముగిసింది. కాగా, ‘యువశక్తి:వికసిత భారత్‌’ ఇతివృత్తంగా ఈ సంవత్సరం ‘ఎన్‌సిసి ప్రధానమంత్రి ర్యాలీ’ నిర్వహించారు.

దేశాభివృద్ధిపై ‘ఎన్‌సిసి’ నిబద్ధతను చాటేవిధంగా 800 మందికిపైగా కేడెట్లు సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చారు. అలాగే 18 మిత్రదేశాల నుంచి 144 మంది యువ కేడెట్లు కూడా ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

మేరా యువ భారత్, విద్యా మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల శాఖ ద్వారా 650 మందికిపైగా వలంటీర్లు కూడా ‘ఎన్‌సిసి’ ప్రధానమంత్రి ర్యాలీలో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com