34.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

నలంద ఇన్ స్టిట్యూట్‌ లో గణతంత్ర వేడుకలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నలందా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హైదరాబాద్‌ లోని  వెంగల్ రావు నగర్ లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా  ప్రముఖ అంబాసిడర్ డాక్టర్ దీపక్ వోహ్రా పాల్గొన్నారు.  అంతర్జాతీయ స్థాయిలో అనుభవజ్ఞుడైన డాక్టర్ వోహ్రా,  తమ ప్రేరణాత్మక సందేశాలతో విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బంది సహా అందరికీ మరపురాని అనుభూతి కలిగించారు.

జాంబవన్ ఎఫెక్ట్ గురించి డాక్టర్ వోహ్రా  ఈ సంధర్భంగా వివరిస్తూ.. భారతీయ పురాణాల నుండి ప్రేరణ పొందుతూ, ప్రతి ఒక్కరూ తమ లోపల ఉన్న శక్తిని గుర్తించుకోవాలన్నారు. భారతదేశం కేవలం అభివృద్ధి చెందడమే కాక, అంతర్జాతీయంగా నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లు గర్వంగా వెల్లడించారు. ఈ ఉజ్జీవభరిత సందేశంతో యువతకు భవిష్యత్తు బాధ్యతను అందజేయాలని సూచించారు.

డాక్టర్ వోహ్రా విద్యార్థులను “గర్వంగా భారత సంతానులు” అంటూ ఉద్దేశించి దేశభక్తి మరియు బాధ్యతభావాలను నింపారు. అందులో భాగంగా, నలందా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క నినాదం “WERULE” ని కేవలం స్కూల్ నినాదంగా కాక, గ్లోబల్ నినాదంగా ప్రపంచానికి మార్గనిర్దేశం చేయాలని ప్రశంసించారు. ఇది సాధన, నాయకత్వం, మరియు గొప్పతనానికి ప్రతీకగా ఉండాలని అన్నారు.

భారతదేశం వివిధ రంగాలలో సాధిస్తున్న ప్రగతిని ప్రస్తావిస్తూ, దేశ భవిష్యత్తుకు  టార్చ్‌ బేరర్‌ గా యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.

దేశానికి సేవ చేయగల నాయకులను తీర్చిదిద్దడంలో నలందా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటి స్ఫూర్తిదాయకమైన సమావేశాల నిర్వహించడం ప్రశంశనీయమని  డాక్టర్ వోహ్రా  కొనియాడారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com