29.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

ఎపి లో భారీగా ఐ ఎ ఎస్ ల బదిలీలు

ఏపీలో ఐఏఎస్ లకూ భారీగా బదిలీలు జరిగాయి. మొత్తంగా 25 మంది ఐఏఎస్సులు బదిలీ అయ్యారు. కీలకమైన శాఖల్లో బదిలీలు చోటు చేసుకున్నాయి. సీఎం పేషీలోకి సీనియర్ ఐఏఎస్ సాయి ప్రసాద్ వెళ్లారు. ప్రస్తుత ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ గా వ్యవహరిస్తున్న సాయి ప్రసాద్ ఆ బాధ్యతలు కొనసాగిస్తూనే.. సీఎం పేషీలో విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం సీఎస్ పేషీలో ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో ఉన్న పీయూష్ కుమారును అక్కడి నుంచి తప్పించారు. ఇక పట్టణాభివృద్ధి శాఖకు సీనియర్ ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్, సీఆర్డీఏకు కన్నబాబు బదిలీ అయ్యారు.
బదిలీ అయిన ఐఏఎస్సుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
01. సాయి ప్రసాద్ – సీఎం స్పెషల్ సీఎస్
02. అజేయ్ జైన్ – టూరిజం కల్చర్ స్పెషల్ సీఎస్ (FAC)
03. బుడితి రాజశేఖర్ – పశు సంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ (FAC)
04. సునీత – పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ
05. వాణి మోహన్ – అర్కియాలజీ, మ్యూజియం కమిషనర్ కమిషనర్
06. పీయూష్ కుమార్ – ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ
07. ఎంకే మీనా – ప్రిన్సిపల్ సెక్రటరీ, జీఏడీ (పొలిటికల్)
08. సురేష్ కుమార్ – పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
09. సౌరభ్ గౌర్ – సివిల్ సప్లైస్ కమిషనర్
10. కోన శశిధర్ – స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీ
11. కాటంనేని భాస్కర్ – ఐటీ సెక్రటరీ
12. వాకాటి కరుణ – సెర్ప్ సీఈఓ
13. యువరాజ్ – ఐ అండ్ ఐ సెక్రటరీ
14. కన్నబాబు – సీఆర్డీఏ కమిషనర్
15. ఎం ఎం నాయక్ – సాంఘీక సంక్షేమ శాఖ సెక్రటరీ
16. ప్రవీణ్ కుమార్ – గనుల శాఖ సెక్రటరీ
17. శేషగిరి బాబు – కార్మిక శాఖ కమిషనర్
18. సత్యనారాయణ – బీసీ వేల్ఫేర్ సెక్రటరీ
19. వినయ్ చంద్ – దేవదాయ శాఖ కమిషనర్
20. వీర ప్యాండియన్ – వైద్యారోగ్య శాఖ కమిషనర్
21. హరినారాయణన్ – ఐజీ రిజిస్ట్రేషన్స్
22. గిరీషా – ఏపీఎంఎస్ఐడీసీ వీసీఎండీ
23. రవి సుభాష్ – సీపీడీసీఎల్ ఎండీ
24. సంపత్ కుమార్ – సీడీఎంఏ
25. అభిషేక్ – పోలవరం ఆర్ అండ్ ఆర్ (ప్రాజెక్టు ఆఫీసర్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com