వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని మృతి చెందిన విద్యార్థిని చౌదరి శైలజ కుటుంబానికి రెండు ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇళ్ళు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. తక్షణ సహాయం కింద లక్షా ఇరవై వేల రూపాయలను శైలజ కుటుంబానికి అందజేశారు. హాస్టల్లో కలుషిత ఆహారం తిని నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చిందిన శైలజకు ఈరోజు నాలుగు గంటల హైడ్రామా తర్వాత స్వంత గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. ఎమ్మెల్సీ దండే విఠల్, డిసిసి అధ్యక్షులు విశ్వప్రసాద్ లు శైలజ అత్యం క్రియల్లో పాల్గొన్నారు.