24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

కాళేశ్వరంపై రెండో రోజు కొనసాగిన విచారణ

కాళేశ్వరంపై రెండో రోజు కొనసాగిన విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో బీఆర్కే భవన్లో జరిగిన రెండో రోజు విచారణ ముగిసింది. ఈ ప్రాజెక్టులో పనిచేసిన 16 మంది ఇంజనీర్లు ఈ రోజు కమీషన్ ముందు హాజరయ్యారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గంగం వేణుబాబు అనే ఇంజనీరుపై కమీషన్ సీరియస్ అయ్యింది. ఇక క్రమపద్దతిలో బ్లాకుల నిర్మాణం చేయకపోవడంపై కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో కమీషన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదు. ఒక ఇంజనీరింగ్ అధికారి 2వ ఏ బ్లాకు డిజైన్ల విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వడంతో బహిరంగ విచారణలో ప్రమాణం చేసి ఎలా తప్పు సమాచారం ఇస్తావని కమీషన్ ఆఅధికారిని నిలదీసింది. క్రిమినల్ కోర్టుకు రెఫర్ చేస్తే  సీరియస్ యాక్షన్ ఉంటుందని కమీషన్ ఇంజనీర్ ను హెచ్చరించింది. బ్లాకుల నిర్మాణంలో రిటైర్డ్ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకే ముందుకు వెళ్ళామని డీఈ భద్రయ్య కమీషన్ కు తెలిపారు. ఈ రోజు కమీషన్ ముందుకు వచ్చిన ఇంజనీర్లతో ప్లేస్మెంట్ రిజిస్టర్, మెజర్మెంట్ రికార్డుల్లో కమీషన్ సంతకాలు పెట్టించి పంపింది. రేపు మరో 18 మంది ఇంజనీర్లు పినాకి చంద్రఘోష్ కమీషన్ ముందుకు విచారణకు హాజరుకానున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com