యువరాజ్ సింగ్.. ముద్దుగా యువీ అని పిలుచుకునే ఈ ఇండియన్ క్రికెటర్ గురించి చాలా మందికి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదనే చెప్పాలి. తన ఆటతో, తన లైఫ్‌స్టైల్‌తో, తన పోరాట పటిమతో ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడు యువరాజ్ సింగ్. తన ఆలౌరౌండ్ పర్ఫామెన్స్‌తో ఎంతో మందికి ఆరాధ్య క్రికెటర్‌గా మారిన యువరాజ్ సింగ్ బర్త్‌డే ఈరోజే.
2000వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యువీ.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా.. ఆఫ్ స్పిన్నర్ బౌలర్‌గా టీమిండియాకు ఎన్నో గెలుపులను అందించడంలో సక్సెస్ అయ్యాడు. 2002లో నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో యువీ ఆడిన ఇన్నింగ్స్ హిస్టారిక్‌గా నిలిచిపోతుంది. ఇక 2007లో టీ20 వరల్డ్ కప్‌లో ఆరు బంతుల్లో కొట్టిన ఆరు సిక్స్‌లు ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. ఇక 2011 వరల్డ్ కప్ రావడంలో యువీ పాత్ర అస్సలు మరిచిపోలేనిది. నిజానికి తను అప్పటికే క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. 19 ఏళ్ల పాటు క్రికెట్‌కు సేవలందించిన యువీ… తన కెరీర్‌లో 402 మ్యాచ్‌లు ఆడి.. 11,778 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు కూడా ఉన్నాయి. యువీ అకౌంట్‌లో 148 వికెట్లు కూడా ఉన్నాయి. 40 టెస్ట్, 304 వన్డే, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడిన యువరాజ్.. 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు.
ఇవన్నీ ఒకెత్తు అయితే.. క్యాన్సర్ బారిన పడి కోలుకోవడం మరో ఎత్తు అనే చెప్పాలి. అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ నుంచి పూర్తిగా కొలుకున్నాడు యువరాజ్. అతను గ్రౌండ్‌లో అయినా.. బయట అయినా ఓ ఫైటర్ కాబట్టే ఇప్పుడతని జీవితంపై ఓ బయోపిక్ తీసేందుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, మరో నిర్మాత రవి భాగ్ చందక ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలుస్తోంది… హ్యాపీ బర్త్ డే యువరాజ్