32 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

కేసీఆర్ పూర్తి చేసిన పనులను రేవంత్ ప్రారంభిస్తున్నారు

ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూర్తి చేసిన పనులను రేవంత్ రెడ్డి శనివారం వచ్చి ప్రారంభోత్సవాలు చేశారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి ఎద్దవా చేశారు. జిల్లా మంత్రులు కొత్తగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టి పనులు చెయ్యలేది ఆయన విమర్శించారు. ఆదివారం సూర్యాపేటలో ఆయన విలేకరలతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ లకు కొత్తగా శంఖుస్ధాపనలు చేసే దమ్ము లేదన్నారు. కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంటే నిదర్శనమన్నారు. 2027 నాటికి 24వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనే టార్గెట్ గా మేము పనిచేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రాష్ట్రానికి శనిలాంటిదని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఫ్లోరైడ్ మహమ్మారి జిల్లా అంతటా వ్యాపించిందని మిషన్ భగీరథతో ప్లోరైడ్ ని నిర్మూలించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. జిల్లా మంత్రి అప్పట్లో యాదాద్రి ప్లాంట్ ను కూలగొడతా అని మతిస్ధిమితం తప్పి మాట్లాడారని కానీ బుద్ధి తెచ్చుకుని శనివారం ప్రారంభోత్సవంలో పాల్గాన్నారని కోమటిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ మాత విగ్రహాన్ని మేము అంగీకరించడం లేదని ఆ విగ్రహాన్ని సచివాలయంలో పెట్టడానికి వీలులేదని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com