36.2 C
Hyderabad
Saturday, May 30, 2026

Live Video

spot_img

రాశిఫలాలు..16.02.25  నుంచి 22.02.25 వరకు

ముఖ్యమైన పండగలు-పర్వదినాలు..

16, ఆదివారం, సంకటహర చతుర్ది.

మేషం

బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ ఆశయాలు కొన్ని నెరవేరతాయి. గతంలో నిలిచిపోయిన కార్యాలు కూడా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగయత్నాలలో పురోగతి సాధిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులు పెట్టుబడులకు తగినంతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఉత్సాహాన్నిస్తాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు ఖరారు కాగలవు. విద్యార్థులు  విజయాల బాటలో నడుస్తారు. షేర్ల విక్రయాలలో లాభాలు. 20,21 తేదీలలో  అనుకోని ప్రయాణాలు. బంధువిరోధాలు.

వృషభం

ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. అనుకోని సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మీ సేవలు విస్తృతమవుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. జీవితాశయం నెరవేరుతుంది.  వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వివాహ యత్నాలు ముమ్మరం చేస్తారు. తరచూ దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు వచ్చే వీలుంది. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతమైన సమయం. విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.  16,17 తేదీలలో  దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు.

మిథునం

ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తాయి. వేడుకలకు హాజరవుతారు. పాతబాకీలు వసూలై అవసరాలు తీరతాయి. పెండింగ్‌లో పడిన కార్యాలు సైతం పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబసభ్యులను సంప్రదిస్తారు. దైవారాధన కార్యక్రమాలు చేపడతారు. స్వల్ప అనారోగ్యం, ఔషధసేవనం. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొద్దిపాటి  ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలకు పురస్కారాలు. కళాకారులు, పరిశోధకుల నిరీక్షణ ఫలిస్తుంది. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. 18,19 తేదీలలో  దుబారా ఖర్చులు. స్వల్ప అస్వస్థత.

కర్కాటకం

ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటాయి. ముఖ్య కార్యాలు సవ్యంగా పూర్తి కాగల సమయం. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి. సన్నిహితులు, సోదరులతో విభేదాలు తొలగుతాయి.  చాకచక్యంగా శత్రువులను సైతం స్నేహితులుగా మార్చుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు కొంత  చికాకు పరుస్తాయి. ఇంటి నిర్మాణాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వ్యాపారులు క్రమేపీ లాభాల బాట పడతారు. ఉద్యోగులకు  హోదాలు అనుకోని విధంగా దక్కవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు ఒత్తిడులు తొలగుతాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. 20,21 తేదీలలో  ఆరోగ్యసమస్యలు. శ్రమ తప్పదు.

సింహం

ముఖ్య కార్యాలు నత్తనడకన సాగుతాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా తప్పకపోవచ్చు. స్నేహితులతో అకారణంగా వివాదాలు. శారీరక రుగ్మతలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. నిర్ణయాలు కొన్ని తప్పనిపరిస్థితిలో మార్చుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం కోసం మరింత శ్రమిస్తారు. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆప్తులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. భూములు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు  ఒక సమాచారం ఊరటనిస్తుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. కళాకారులు, క్రీడాకారులకు ఒత్తిడులు.  షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి. 18,19 తేదీలలో   ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో స్వల్ప వివాదాలు.

కన్య

చేపట్టిన కార్యాలు కొంత నిదానంగా సాగుతాయి. ఆదాయ వనరులు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కొన్ని సమస్యల నుంచి ఎట్టటకేలకు బయటపడతారు. సేవాకార్యక్రమాలలో మీరూ భాగస్వాములవుతారు. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు దక్కవచ్చు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. కొత్త భాగస్వాములు మీతో కలుస్తారు. ఉద్యోగవర్గాలకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు సంభవం. రాజకీయవేత్తలు, కళాకారులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. షేర్ల విక్రయాలలో లాభాలు రాగలవు. 21, 22 తేదీలలో వృథా ఖర్చులు. బంధువులతో తగాదాలు.

తుల

రావలసిన సొమ్ము కొంత అంది అవసరాలు తీరతాయి. ముఖ్యమైన  కార్యాలు సకాలంలో  విజయవంతంగా పూర్తి కాగలవు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారి చేయూతనందిస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. వ్యాపారులు తమ అనుభవాలతో విస్తరణ యత్నాలు పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు అనూహ్యమైన విజయాలు సాధిస్తారు. కళాకారులు పురస్కారాలు అందుతాయి. షేర్ల విక్రయాలలో ఆశించిన లాభాలు. 16,17 తేదీలలో   స్వల్ప రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు.

వృశ్చికం

అదనపు ఆదాయంతో మరింత ఉత్సాహంగా సాగుతారు. బంధువులతో వివాదాలు తీరి మరింత దగ్గరవుతారు. కొన్ని సమస్యలు స్వయంగా పరిష్కరించుకుంటారు. మీ ఆలోచనలు అందర్నీ మెప్పిస్తాయి.  కొత్త కాంట్రాక్టులు పోటీని తట్టుకుని దక్కించుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన వరంగా మారనుంది. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది. కళాకారులకు అవార్డులు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, వైద్యులకు విదేశీ ఆహ్వానాలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. 20,21  తేదీలలో  అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు.

ధనుస్సు

కొన్ని కార్యాలు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆదాయం ఆశించినంత అందకపోవడంతో డీలాపడతారు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. శారీరక సంబంధిత రుగ్మతలు. సోదరులు, స్నేహితులతో స్వల్ప  తగాదాలు. దూరప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో కొంత సఫలం. వ్యాపారులు పెట్టుబడులు సమకూరినా  కొంత నిరాశ చెందుతారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు సంభవం. కళాకారులకు ఒత్తిడులు తప్పవు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు కొంత శ్రమ తప్పకపోవచ్చు. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే. 19,20 తేదీలలో   శుభవార్తలు. వాహనయోగం.

మకరం

వీరికి క్రమేపీ మరింత అనుకూల సమయం. ఇష్టమైన వ్యక్తులు దగ్గరవుతారు. సోదరులు, సోదరీల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. మీ వ్యూహాలు అమలు చేసి ప్రత్యర్థులను సైతం మెప్పిస్తారు.  చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇంట్లో  శుభకార్యాలు నిర్వహిస్తారు. గృహ నిర్మాణాలు లేదా కొనుగోలులో స్వల్ప అవాంతరాలు. వ్యాపారులు  అనుకున్న లాభాల వైపు సాగుతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు వచ్చే వీలుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు పట్టింది బంగారమే. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. 17,18తేదీలలో    కుటుంబంలో ఒత్తిడులు. శారీరక రుగ్మతలు.

కుంభం

ఆదాయం కంటే ఖర్చులు పెరిగినా తట్టుకుంటారు. చేపట్టిన కార్యాలు విజయవంతంగా సాగుతాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. శ్రేయోభిలాషుల శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు సకాలంలో తీసుకుని కుటుంబసభ్యులను ఆకట్టుకుంటారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు స్వల్ప లాభాలు అందే అవకాశాలు. ఉద్యోగులకు  ఎట్టకేలకు  పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు విదేశీ పర్యటనలు. కళాకారులు అవకాశాలు ఊహించని రీతిలో లభిస్తాయి. షేర్ల విక్రయాలలో కొద్దిపాటి లాభాలు. 16,17 తేదీలలో   ఖర్చులు పెరుగుతాయి. మనశ్శాంతి లోపిస్తుంది.

మీనం

కొన్ని కార్యాలలో అవాంతరాలు తొలగుతాయి. శుభకార్యాలలో చురుగ్గా  పాల్గొంటారు. రావలసిన బాకీలు కొంతమేర అందే సూచనలు. బంధువుల నుంచి  ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాల నుంచి కొంత ఊరట లభిస్తుంది.  నిరుద్యోగులకు  ఉద్యోగ లాభాలు పొందుతారు. ఆరోగ్యం గతం కంటే కుదుటపడుతుంది. వ్యాపారులకు  ఆశించిన విధంగా లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవేత్తలు, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. క్రీడాకారులకు  అవకాశాలు దగ్గరకు వస్తాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. 19, 20 తేదీలలో   వివాదాలు. మానసిక అశాంతి.

 

 

 

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com