మరికొంతమంది అమెరికా అక్రమ వలసదారులు భారత్‌కు చేరుకున్నారు. రెండో బ్యాచ్‌లో 116 మందిని తరలించింది అమెరికా. వీరంతా శనివారం రాత్రి అమృత్‌సర్‌కు చేరుకున్నారు. ఈసారి వచ్చిన వారిలో పంజాబ్, హర్యానాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. పంజాబ్ నుంచి 60 మంది, హర్యానా నుంచి 30 మంది, గుజరాత్, యూపీ, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌కు చెందిన కొందరు ఉన్నట్టు గుర్తించారు.
ఈ విమానం షెడ్యూల్ చేసిన సమయం కంటే 90 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. ఈసారి కూడా సీ-17 యుద్ధ విమానంలోనే వలసదారులను తరలించింది అమెరికా. వీరందరి నుంచి వివరాలు సేకరించిన తర్వాత వారి ఇళ్లకు పంపనున్నారు అధికారులు.
అక్రమ వలసదారులతో కూడిన మూడో విమానం నేడు అమృత్‌సర్‌కు చేరుకోనుంది. ఈ విమానంలో 157 మంది వస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో కూడా పంజాబ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మూడో బ్యాచ్‌లో 52 మంది పంజాబ్‌కు చెందినవారు.. 59 మంది హర్యాణా, 31 మంది గుజరాత్‌కు చెందినవారు కాగా.. మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది.
అమెరికా నుంచి మొత్తం 487 మంది అక్రమ వలసదారులను తరలించేందుకు ఆ దేశం ఆదేశాలు జారీ చేసిందని భారత విదేశాంగశాఖ ఇప్పటికే ప్రకటించింది. వీరందరూ విడతల వారీగా భారత్‌కు రానున్నారు. తొలి బ్యాచ్‌లో వచ్చిన వారి కాళ్లు, చేతులకు సంకెళ్లు వేయడం వివాదస్పదంగా మారింది. దీంతో ఈ విషయంపై అమెరికా అధికారులతో చర్చిస్తామని విదేశాంగశాఖ ప్రకటించింది. మరి ఈసారి వచ్చిన వారి పరిస్థితి ఏంటన్నది సస్పెన్స్‌గా మారింది.