26.7 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

రేపటి నుంచి జగన్ పులివెందుల పర్యటన

రేపటి నుంచి నాలుగు రోజుల పాటు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ పులివెందుల పర్యటన

24.12.2024 షెడ్యూల్‌

ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని దివంగత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తారు, అనంతరం ప్రేయర్‌ హాల్‌లో జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారు, సమావేశం అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్ళి రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు

25.12.2024 షెడ్యూల్‌

ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్‌ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొంటారు, ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించిన అనంతం పులివెందుల చేరుకుని రాత్రికి బస చేస్తారు

26.12.2024 షెడ్యూల్‌

పులివెందుల క్యాంప్‌ ఆఫీస్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్భార్‌ నిర్వహిస్తారు

27.12.2024 షెడ్యూల్‌

ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరగనున్న వివాహానికి హాజరవుతారు, అనంతరం బయలుదేరి బెంగళూరు వెళతారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com