మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుమార్తె వర్షా రెడ్డి ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజీ నుంచి సైన్స్ లో పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన వైఎస్ జగన్… కుమార్తె వర్షారెడ్డి డిస్టింక్షన్ లో పాస్ కావడం సంతోషకరమన్నారు.
గాడ్ బ్లెస్ యు అని చిన్న కుమార్తె వర్షారెడ్డిని ఆశీర్వదించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా జగన్ ట్వీట్ చేశారు. సతీమణి భారతి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉన్న ఫొటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
లండన్‌లోని ప్రతిష్ఠాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి వర్షారెడ్డి ఎంఎస్సీ ఫైనాన్స్ లో పట్టా అందుకున్నారు. జగన్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఈ నెల 16న జరిగిన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమం (స్నాతకోత్సవం)లో భార్యతో కలిసి పాల్గొన్నారు. ఈ నెలఖరు వరకు జగన్ విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకుంటారు.
పారిస్‌లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ (Insead Business School) లో మాస్టర్స్ పూర్తి చేసిన వైఎస్ జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి ప్రస్తుతం ఇంగ్లాండ్ లోనే ఉంటోంది. మాజీ సీఎం ఇద్దరు కుమార్తెలు ఆర్థికశాస్త్రంలో నిష్ణాతులు కావడం గమనార్హం.