వైయస్సార్ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రామాలయాన్ని ప్రారంభించారు. లింగాల మండలం తాతిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీరాముడి దేవాలయానికి శాస్త్రోక్తంగా ప్రారంభోత్సవం చేశారు. గ్రామంలోని కోదండ రామాలయం నిర్మాణం ఇటీవలే పూర్తికాగా.. మంగళవారం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. వైఎస్ జగన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు వస్తున్నారని తెలిసి గ్రామస్తులంతా ఆయనకు బ్రహ్మరథం పట్టారు. రామాలయ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా తాతిరెడ్డిపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది.