27 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం

అవధూత దత్త పీఠాధిపతి శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి మార్గదర్శకత్వంలో కురుక్షేత్రలోని పంజాబీ ధర్మశాలలో నిర్వహించిన శ్రీమద్ భగవద్గీత సంపూర్ణ పారాయణ యజ్ఞం నిర్వహించారు. ఈ పారాయణ కార్యక్రమంలో 12 దేశాలకు చెందిన ఎన్నారై విద్యార్థులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా అవధూత దత్త పీఠంతో అనుబంధం ఉన్న 50 దేశాల నుండి భక్తులు పవిత్రమైన కురుక్షేత్ర నేలపై సమిష్టిగా గీతా శ్లోకాలను పఠించడానికి భారతదేశానికి త‌ర‌లి వ‌చ్చారు. 2015లో తెనాలి జిల్లాలో 1,00,000 మందికి పైగా హనుమాన్ చాలీసా సమూహ పఠనాన్ని నిర్వహించడం, గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సంపాదించడం వంటి మునుపటి విజయాల నుండి స్వామిజీ గీతా పారాయణంతో మరో రికార్డు సాధించారు. గతంలో స్వామిజీ సిడ్నీ ఒపెరా హౌస్‌లో సంగీత హీలింగ్ కచేరీతో పాటు అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో కార్య సిద్ధి హనుమాన్ ఆలయంలో నిరంతర మంత్ర పఠనం చేసి కూడా రికార్డులు నెలకొల్పారు. తాజాగా కురుక్షేత్రలోని పంజాబీ ధర్మశాలలో భగవద్గీతలోని 700 శ్లోకాలను సమిష్టిగా పఠించడానికి 50 దేశాలకు పైగా ఎన్నారై భక్తులు ఒకేచోట చేర‌డం మరో రికార్డ్. పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా శాంతి సందేశాన్ని వ్యాప్తి చేస్తూ, గీతా శ్లోకాల పారాయణాలు నిర్వహించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్ర‌మానికి ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com