24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

వైఎస్ భారతి… ది ఆల్ రౌండర్

వైఎస్ భారతి… పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి సతీమణి, సాక్షి మీడియా సంస్థల అధిపతిగా తెలుగు ప్రజలకు ఆమె సుపరిచితురాలే. మల్టీ ట్యాలెంటెడ్ మహిళకు వైఎస్ భారతి ఒక నిఖార్సైన ఉదాహరణ. ఒకవైపు పారిశ్రామికవేత్తగా సాక్షి మీడియా, భారతి సిమెంట్స్ ను సమర్థవంతంగా ముందుకు తీసుకుని వెళుతూనే తల్లిగా తన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నత విద్య చదువుకునే విధంగా తీర్చిదిద్దారు. ఎక్కడా ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కింగ్స్ కాలేజ్ లండన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి పిల్లలు ఇద్దరూ గ్రాడ్యుయేట్స్ అవటం వెనుక తల్లిగా ఆమె పోషించిన పాత్ర ప్రతిఫలిస్తుంది. ఒక ఉన్నత స్థాయి రాజకీయ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టినా ఎప్పుడూ తెర వెనుక ఉండటానికే ప్రాధాన్యత ఇవ్వటం ఆమె అరుదైన వ్యక్తిత్వానికి నిదర్శనం. హై ప్రొఫైల్ ఫ్యామిలికి చెందినప్పటికీ వేషధారణ, పలుకరింపు, వ్యవహారశైలిలోనూ సింపుల్ గా, డౌన్ టు ఎర్త్ ఉండటం భారతి లాంటి కొద్దిమందికి మాత్రమే సాధ్యం. జగన్ ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏలిన సమయంలో కూడా సీఎమ్ భార్యగా లభించే ప్రచారానికి సైతం ఆమె దూరంగానే ఉన్నారు. ఎవరైనా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుంటే వారి భార్య లేదా భర్త, పిల్లలకు ప్రోటోకాల్ ప్రకారం వేదిక పై కూర్చునే అవకాశం ఉంటుంది. 2019లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే వేదిక పై జగన్ తో పాటు తల్లి వైఎస్ విజయమ్మ మాత్రమే ఉంటారు. భార్యగా తనకు ప్రోటోకాల్ ఉన్నా…భారతి మాత్రం వేదిక కింద అతిథుల గ్యాలరీలో కూర్చుని తన భర్త విజయాన్ని ఆస్వాదించారు. జగన్ రాజకీయ ప్రస్థానం, కష్టాలు, సవాళ్ళు…అన్నింటా ఆమె భర్తకు అండగా నిలబడ్డారు. ఇవే కాదు చాలా మందికి భారతి గురించి తెలియని కోణం ఆమె చేసే దాతృత్వం. కుడి చేత్తో ఇస్తే ఎడం చేతికి తెలియకూడదని పెద్దలన్నట్లు భారతి తాను చేసే దాతృత్వ కార్యక్రమాల గురించి పది మందికి చెప్పుకోవటం కాని, ప్రచారం చేసుకోవటం కాని చేయరు. ముఖ్యమంత్రి భార్య హోదాలో ఉన్నప్పుడే సెక్యూరిటీ హడావిడి లేకుండా విజయవాడలోని అనాథశ్రమానికి ప్రతి వారం వెళ్లేవారు అన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా మానసిక వికలాంగ చిన్నారులు, ఆడపిల్లల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. అటువంటి వారికి సహాయం చేయటంలో ఆమెది ఎముక లేని చేయి అని భారతి సన్నిహితులు చెబుతుంటారు. పరిపూర్ణ మహిళగా వైఎస్ భారతి ప్రస్థానం చాలా మంది మహిళలకు స్పూర్తి. నేడు డిసెంబర్ 9 వైఎస్.భారతి జన్మదినం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com