కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేస్తోందని మాజీ మంత్రి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. నిజాయితీ గల అధికారి అయిన పీఎస్‌ఆర్ ఆంజనేయులుని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. డీజీపీ అవ్వాల్సిన వ్యక్తిని అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. జత్వానీ బ్లాక్ మెయిలర్ అని ఆమో సంగతి ముంబయ్ లో అందరికీ తెలుసని ఆమె అరెస్ట్ చట్ట ప్రకారమే జరిగిందని అంబట్ చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో చంద్రబాబును అరెస్ట్ చేశామన్న కక్షతోనే పీఎస్‌ఆర్‌ని అరెస్ట్ చేశారని అంబటి ఆరోపించారు. రాజ్ కసిరెడ్డి విషయంలో కూడా ఎటువంటి స్కామ్ లేకుండానే ఆయన్ను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు అని ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని అంబటి విమర్శించారు. లోకేష్ సృష్టించిన ఉర్సా కంపెనీకి మూడు వేల కోట్ల రూపాయల భూమిని అప్పనంగా ఇచ్చేశారని ఈ విషయంపై ప్రజల్లో చర్చ నడుస్తుంటే దాన్ని డైవర్ట్ చెయ్యడానికే సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, రాజ్ కసిరెడ్డిలను అరెస్ట్ చేశారని ఆరోపించారు. పోలీసులకు న్యాయ స్ధానం మొట్టికాయలు వేసినా సిగ్గు లేదని, మాజీ ఎంపీ మాధవ్ ని అరెస్ట్ చేసిన కేసులో పదకొండు మందిని సస్పెండ్ చేశారని ఈ విషయంలో హోం మంత్రి రాజీనామా చేయాలని అంబటి డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారని, ఆయన చంద్రబాబు చేతిలోకి వెళ్లారని అంబటి అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే శాశ్వతంగా అధికారంలో ఉండదని ఈ అక్రమ అరెస్టులకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోవాలని అంబటి రాంబాబు హెచ్చరించారు.
- Advertisement with us -