24 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

మీ సహకారం లేదు… మీకు చేతకావడం లేదు…

  • తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటలు యుద్ధం
  • రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిల మధ్య వాదోపవాదాలు
  • కౌంటర్లపై కౌంటర్లు ఇచ్చుకుంటున్న ఇద్దరు నేతలు
  • కిషన్ రెడ్డికి 9 పేజీల బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి
  • నిధుల విషయంలో తప్పంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అంటున్న కిషన్ రెడ్డి
  • పొలిటికల్ వార్ లో పక్కకు వెళ్లిన టిఆర్ఎస్
  • తమ ఆరోపణల నుంచి దృష్టి మళ్లించడానికి నకిలీ ఫైట్ అంటున్న బిఆర్ఎస్

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఆధారంగా కాంగ్రెస్ అధికారంలో బిఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉంది. ఈ రెండు పార్టీల మధ్య మాటలు యుద్ధం కొత్తేమీ కాదు గత పదిహేను సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతూనే ఉంది. అయితే తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య మాటలు, లేఖల యుద్ధం మొదలైంది. ఒకరకంగా బిఆర్ఎస్ ను సైడ్‌ ట్రాక్‌ చేసి ఈ రెండు పార్టీల మధ్య బహిరంగంగానే వాదనలు జరుగుతున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బిజెపి, కాంగ్రెస్ పార్టీలే తలపడ్డాయి.. వివిధ కారణాల చేత ఈ ఎన్నికలకు టిఆర్ఎస్ దూరంగా ఉంది. గత రెండు మూడు రోజులుగా ఢిల్లీలో మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు ముఖ్యమంత్రి బహిరంగ లేఖ రాసే వరకు చేరుకుంది.

ఇక అసలు విషయానికొస్తే వివాదం మొదలు కావడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్. ఫోన్ టాపింగ్ నుంచి మొదలు పట్టుకొని కేంద్ర ప్రభుత్వ నిధుల వరకు బిజెపిపై ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. ఒక రకంగా బిఆర్ఎస్ ను బిజెపి రాజకీయంగా రక్షిస్తోందని ఆయన ఆరోపించారు. మెట్రో రైల్ కి కూడా సహకారం అందించడం లేదని ఆయన విమర్శలు చేశారు.

అయితే ఈ అంశంలో రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎవరని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ రాష్ట్రానికి రావలసిన నిధులు ఇతర అంశాలపై దృష్టి పెట్టాల్సిన సీఎం తమపై విమర్శలు చేయడం సరైనది కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి చేతకావడం లేదని నిధులు ఎలా తెచ్చుకోవాలో కూడా తెలియడం లేదని హాట్ కామెంట్స్ చేశారు.

ఈ మాటలు యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా శుక్రవారం రోజు బహిరంగ లేఖను విడుదల చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాసిన ఈ లేఖలో పలు అంశాలను రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. గతంలో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించిన జయపాల్ రెడ్డి, వెంకటస్వామి లాంటి నేతలు తెలంగాణ కోసం అన్ని విధాలుగా సహకరించారని. కిషన్ రెడ్డి మాత్రం పూర్తిగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు. 9 పేజీల బహిరంగ లేఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి అనేక కామెంట్స్ చేశారు. తెలంగాణకు ఏమీ చేయలేదని తన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని విమర్శలు చేశారు.

జాతీయస్థాయిలో కాంగ్రెస్, బిజెపిల మధ్య ప్రతిరోజు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నా… తెలంగాణలో మాత్రం మొదటిసారిగా రెండు పార్టీలు గట్టిగా ఫైట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది . అయితే ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న రాష్ట్ర స్ధాయి రాజకీయ వార్‌ ను బిఆర్ఎస్ మరో విధంగా చూస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా తాము అనేక అంశాలను ప్రస్తావిస్తుంటే వాటికి సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టిని మళ్ళించడానికి బిజెపి, కాంగ్రెస్ లు గొడవ పడినట్లుగా నటిస్తున్నాయని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com