28.6 C
Hyderabad
Thursday, November 5, 2026

Live Video

spot_img

హిమాచల్ ప్రదేశ్‌లో ఎల్లో అలెర్ట్

హిమాచల్‌ ప్రదేశ్‌లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. ఉత్తర భారతంలో హిమపాతం ప్రజలను వణికిస్తోంది. పశ్చిమ గాలుల కారణంగా హిమాలయ రాష్ట్రాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో, ఐఎండీ ప్రజలను అప్రమత్తం చేస్తోంది.ఇందులో భాగంగానే ఎల్లో అలర్ట్‌ జారీచేసింది.

మరోవైపు.. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో తీవ్ర హిమపాతం ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమ గాలుల కారణంగా హిమాలయ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, భారీస్థాయిలో హిమపాతం ఉంటుందని ఐఎండీ వార్నింగ్‌ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హిమపాతం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

ఇక, ఢిల్లీ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా 100కు పైగా విమానాల రాకపోకలకు ల్యాండింగ్, టేకాఫ్ లో సమస్యలు ఎదురయ్యాయి. దీంతో, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయం నుంచి వెళ్లే 30 విమానాలను రద్దు చేశారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com