తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షనేతగా కేసిఆర్ ఈసారి హాజరవుతారా? లేదా? అనే చర్చ జరుగుతోంది. అటు గులాబీ శ్రేణులు కూడా ఆసక్తి గా ఎదురుచూస్తున్నాయి.
శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీ ఆర్ ఎస్ 39 స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారింది. పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి కెపిఆర్ శాసనసభ సమావేశాలకు హాజరుకాలేదు. ఎంఎల్ఏగా ప్రమాణ స్వీకారం చేయటానికి మొదటి సమావేశానికి కేసిఆర్ హాజరు కాలేదు. ఆ తర్వాత తుంటి ఎముక శస్త్ర చికిత్స చేయించుకొని మూడు నెలలు విశ్రాంతి లో ఉన్నారు. ఆ తర్వాత కోలుకున్న తర్వాత కేసిఆర్ ఫిబ్రవరి 1న ప్రత్యేకంగా అసెంబ్లీలో ఎంఎల్ఏ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కూడా సాగాయి.. ఇప్పటికే కొత్త ప్రభుత్వం కొలువుదీరాక మూడు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ మూడు సమావేశాలకు కూడా కేసిఆర్ రాలేదు.
ప్రధాన ప్రతిపక్షనేతగా కేసిఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మొదటి 3 అసెంబ్లీ సమావేశాలకు అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. కోలుకున్న తర్వాత ఎందుకు రావటం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాలో కేసిఆర్ రావాలని రేవంత్ రెడ్డి తొడగొట్టి పిలిచారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సమయంలో జరుగుతున్న సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని… ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రావాలని ప్రస్తుతం జరుగుతున్నవి విజయోత్సవాల సమావేశాలు రేవంత్ రెడ్డి పదేపదే ప్రస్తావిస్తున్నారు.
సోమవారం నుంచి జరిగే సమావేశాలకు కేసిఆర్ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అప్పుడు అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు ఇప్పుడు వస్తారా లేదా అనే చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతుంది. ప్రభుత్వానికి ఏడాది టైం ఇచ్చారు కనుక కేసీఆర్ కచ్చితంగా ఈ సమావేశాలకు వస్తారని ప్రచారం జోరుగా సాగుతుంది.. గురుకుల పాఠశాలలో పరిస్థితులు భూముల అమ్మకాలు భూసేకరణ టిఆర్ఎస్ నేతల అరెస్టు వంటి కీలక అంశాలపై ఈసారి అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. కెసిఆర్ వస్తారని ఆలోచనలోనే ప్రస్తుతానికి టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.