30.2 C
Hyderabad
Saturday, June 20, 2026

Live Video

spot_img

మహా సీయం షిండేనా? ఫడ్నవిసా?

  • ఎటూ తేల్చుకోలేక పోతున్న బీజేపీ
    మహా సీఎంపై కొనసాగుతున్న సస్పెన్స్

మహారాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇపుడో..మరో క్షణమో సీఎంని ప్రకటించే దిశగా అడుగులు పడుతున్నాయి. సీఎం సీటు కోసం అటు ఏక్ నాథ్ షిండే, ఇటు దేవేంద్ర ఫడ్నవిస్ హోరా హోరీ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపి, ఆరెస్సెస్ తో పాటు అజిత్ పవార్ కూడా ఫడ్నవిస్ కే మద్దతు ప్రకటించారు. దీంతో ఏక‌ నాథ‌ షిండే.. ప్రధాని మోదీపైనే ఆశలు పెట్టుకున్నారు. మొన్నటి వరకూ పదవిలో ఉన్న షిండే, ఫడ్నవిస్ , అజిత్ పవార్ తమ పదవులకు రాజీనామాలు చేశారు.. అదే టైమ‌ులో శివసేన ఎంపీలంతా మోడీ అపాయింట్ మెంట్ కోరారు. వీరంతా షిండేనే మహారాష్ట్ర సీఎంగా కొనసాగించమని కోరుతున్నారు. మరోవైపు ఆరెస్సెస్ ఫడ్నవిస్ నే సమర్ధిస్తోంది. ఆరెస్సెస్ అధినేత మోహన‌ భగవత్ బీజేపి కేంద్ర నాయకత్వంతో నిన్న సమావేశమై ఇదే అభిప్రాయం చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు దేవేంద్ర ఫడ్నవిస్ సీనియర్ బీజేపి నేతలని, బీజేపి హై కమాండ్ లో చక్రం తిప్పే వీలున్న పెద్దలను కలుసుకుని తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకనాథ షిండే తత్వం తెలిసిన వారు ఫడ్నవిస్ సర్కార‌ు స్థిరంగా కొనసాగుతుందని అనుకోలేమని భయపడుతున్నారు. కానీ ఆరెస్సెస్ మాత్రం ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని కొంతకాలమైనా కొనసాగాల్సిందేనంటున్నారు. ఇద్దరికీ చెరి రెండున్నర సంవత్సరాలు కేటాయిద్దామన్నది మరో ప్రపోజల్. ఈ విషయంలో బీజేపి అధినాయకత్వం ఏం ఆలోచిస్తోందో మరి..
కొత్త సీఎం ఎంపిక వరకూ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన పెడతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ షిండేను ఆపధ్దర్మ సీఎంగా కొనసాగమని చెప్పారు కాబట్టి ప్రెసిడెంట్ రూల్ ని రూల్ అవుట్ చేసేయచ్చు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాతో కూడిన గెజెట్ న‌ు మహారాష్ట్ర గవర్నర‌ సీపీ రాధాకృష్ణన్ ఎన్నికల సంఘం ఇప్పటికే సబ్మిట్ చేసేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 73 ప్రకారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నోటిఫికేషన్ ప్రకటించడమే మిగిలింది. అలా ప్రకటిస్తే కొత్త అసెంబ్లీ ఏర్పడి పోయినట్లే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com