సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది ఎవరో తేలిపోయింది. ఎట్టకేలకు నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు. ఆ రాష్ట్రానికి పారిపోయాడు.. ఈ రాష్ట్రానికి పారిపోయాడు.. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో అనుమానితులను అదుపులోకి తీసుకున్నా.. అవన్ని వృథా ప్రయాసే అయ్యాయి. ఎందుకంటే అసలైన నిందితుడు ముంబైలోని థానేలోనే అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో అసలైన ట్విస్ట్ ఏంటంటే నిందితుడు బంగ్లాదేశీయుడు అని తేలడం.
మహ్మద్ షరీఫుల్ ఇస్లామ్ షేహజాద్.. ఇది సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడి పేరు. ఇతను ఐదు నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడినట్టు గుర్తించారు. ఆ తర్వాత థానేలోని ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేశాడు. అతను చోరి చేసేందుకు సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడని తేల్చారు. అతని వద్ద నుంచి బంగ్లాదేశ్‌కు చెందిన డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
భారత్‌లోకి వచ్చాక అతను పలుమార్లు పేర్లు మార్చుకున్నట్టు గుర్తించారు. విజయ్ దాస్, బిజోయ్ దాస్, మహ్మదద్ ఇలియాస్, BJ ఇలా అనేక పేర్లు మార్చుకున్నట్టు గుర్తించారు. దాడి చేసిన తర్వాత అరెస్ట్ భయంతో పలు ఫోన్లు మార్చినట్టు కూడా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
మరోవైపు లీలావతి హాస్పిటల్ నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం ఇంటికి చేరుకున్నాడు ఈ బాలీవుడ్ హీరో. నిందితుడి దాడిలో సైఫ్ చేతులు, వీపు, మెడపై కత్తి గాయాలయ్యాయి.