- తీసుకు రావాలన్న ప్రతీసారి అడ్డంకులే…
- క్రూ10మిషన్ ప్రయోగం మళ్లీ వాయిదా
- బయలుదేరేముందు పనిచేయని హైడ్రాలిక్ వ్యవస్థ
- దాంతో ప్రయోగం వాయిదా.. ఇవాళ సహకరించని వెదర్
- రేపు మళ్లీ మరోసారి ప్రయత్నం..
- అంతరిక్షంలో ఉత్కంఠగా ఎదురు చూపులు
- నలుగురిని అక్కడ దింపి ఇద్దరిని వెనకకు తరలించాలని ప్రయత్నం
- గత జూన్ నుంచి సునీత ఎదురుచూపులు
- అన్నీ కుదిరితే 19న భూమిపైకి సునీత, విల్మోర్
నాసా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన అమెరికన్ ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్, భారతీయ సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ల రాక మళ్లీ వాయిదా పడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారిద్దరి రాకకి అడుగడుగునా అవాంతరాలు ఎక్కువవుతున్నాయి.వాస్తవానికి 12,13 తేదీలలో బిలియనీర్ ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ నుంచి ఫాల్కన్ రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా పడింది.క్రూ 10 మిషన్ అంతరిక్ష ప్రయాణానికి నిన్న, ఇవాళ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైడ్రాలిక్ సిస్టమ్ లో లోపం తలెత్తడంతో వీరి ప్రయాణం వాయిదా పడినట్లు స్పేస్ ఎక్స్ సంస్థ ప్రకటించింది.
మరో గంటలో ఫాల్కన్ రాకెట్ ఫ్లోరిడా అంతరిక్ష కేంద్రం నుంచి నలుగురు ఆస్ట్రోనాట్లతో కూడిన ఈ రాకెట్ బయల్దేరాల్సి ఉండగా లోపం తలెత్తింది.నాసాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం 39A వేదికగా ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. అయితే తాజాగా అది వాయిదా పడటంతో తిరిగి రేపు అంటే శుక్రవారం 14వ తేదీన మరోసారి 4.33 నిమిషాలకు ప్రయోగించాలని నిర్ణయించారు. డ్రాగన్ అంతరిక్షంలోకి దూసుకు వెళ్లే దారిలో ఈదురుగాలులు, దట్టమైన దుమ్ము రేగే అవకాశం ఉన్నందున వాతావరణ కారణాల రీత్యా ఇవాళ ప్రయోగం వాయిదా పడింది.నాసా ఆస్ట్రోనాట్లు, ఆనీ మాక్లన్,నికోలే ఎయిర్స్,జపాన్ ఏరో స్పేస్ ఏజెన్సీ జాక్సాకి చెందిన టకుయా ఒనిషి,రష్యాకు చెందిన కాస్మోనాట్ కిరిల్ పెస్కోవ్ ఈ రాకెట్ లో నాసా అంతరిక్షకేంద్రానికి బయల్దేరాల్సి ఉంది. మార్చి 19 నాటికి వాతావరణం, రాకెట్, ఇతర ఏర్పాట్లు సరిగ్గా ఉంటే, అనుకున్నది అనుకున్నట్లు జరిగితే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు భూమికి దిగి వస్తారు.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తినుబండారాల వినియోగం సాధ్యమైనంతగా తగ్గించేలా చూడాలని నాసా స్పేస్ ఎక్స్ ఏజెన్సీకి సూచించింది. అంతరిక్ష కేంద్రంలో వ్యర్ధాలను వదిలేయడానికి,పడేయటానికి ఉండదు. వాటినలా వదిలేస్తే అవి అంతరిక్షంలో భార రహిత స్థితిలో చెత్తలా తిరుగుతూనే ఉంటాయి.