35 C
Hyderabad
Friday, April 24, 2026

Live Video

spot_img

వాట్సాప్.. ఓ దేశంలో నిషేధం.. మరో దేశంలో వెల్‌కమ్..

వాట్సాప్‌ ఇప్పుడు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి అతి ముఖ్యమైన ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. అలాంటి వాట్సాప్‌పై ఓ దేశం నిషేధం విధించే ఆలోచనలో ఉండగా… మరో దేశం ప్రస్తుతమున్న నిషేధాన్ని ఎత్తేసేంది. ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే.. ఈ రెండు దేశాలు కూడా మంచి స్నేహితులు కావడం.

కొత్త ఏడాదిలో వాట్సాప్‌కు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది రష్యా. ఏకంగా పూర్తి స్థాయిలో వాట్సాప్‌పై రష్యా నిషేధం విధించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తమ చట్టాలకు లోబడి ఉండకపోతే నిషేధం విధిస్తామని విదేశీ యాప్‌లకు రష్యన్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. రష్యన్ నిబంధనలు పాటించాలా? లేక నిష్క్రమించాలా? అనేది వాట్సాప్‌ యాజమాన్యానికే వదిలివేసినట్లు ఇప్పటికే రష్యన్ కీలక అధికారులు తేల్చి చెప్పారు. దేశంలోని భద్రతా సేవలతో యూజర్ సమాచారాన్ని ప్లాట్‌ ఫామ్ షేర్ చేసుకోకపోతే వచ్చే ఏడాది నుంచి వాట్సాప్‌ను బ్లాక్ చేయగలమని సెనేటర్ అర్టియోమ్ షేకిన్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రమ్‌లపై రష్యాలో నిషేధం ఉంది.

మరోవైపు ఇరాన్‌లో వాట్సాప్, గూగుల్ ప్లేస్టోర్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తేశారు. నిజానికి ఇంటర్నెట్‌పై ఆంక్షలు ఎత్తివేస్తామంటూ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కిన్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఇప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. అయితే వాట్సప్‌, గూగుల్‌ ప్లేస్టోర్‌ వంటి వాటిపై బ్యాన్ ఎత్తేసినప్పటికీ లోకల్ యాప్‌లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తామని ఇరాన్‌ ప్రభుత్వం చెప్పింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com