భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఇటీవలే నిశ్చితార్థం ఘనంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఈడి వెంకట్ దత్తసాయితో ఎంగేజ్ మెంట్ జరగగా వధువరులు రింగులు మార్చుకున్నారు. కాబోయే భర్తతో కేక్ కట్ చేసే ఫోటోను సింధు షేర్ చేశారు. ఒకరి ప్రేమ మనకు దక్కినపుడు మనము ప్రేమించాలని… కోట్ చేస్తూ సింధు ఇన్స్ స్టాగ్రామ్ లో ఫోటో షేర్ చేశారు. నిశ్చితార్థానికి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు తెలిసింది.
2024 డిసెంబర్ 22న, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పీవీ సింధు వివాహం జరుగనుంది. అంగరంగ వైభవంగా ఈ వివాహం జరపడానికి ఇరు కుటుంబాలు సన్నద్ధం అవుతున్నాయి. భారతీయ సంప్రదాయాలతో కూడిన ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు క్రీడా ప్రముఖులు పాల్గొనున్నారు.