మే నెలలో జరగబోయే పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఆయన పెంచలకోన లక్ష్మీనరసింహస్వామని దర్శించుకున్నారు. ఆలయ అధికారుల ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పెనుశీల లక్ష్మీనరసింహస్వామి వారిని ఆదిలక్ష్మి అమ్మవారిని, ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి ఆనం పరిశీలించారు. భక్తుల సౌకర్యార్ధం మరిన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ ప్రకారం పెంచలకోన నరిసింహ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే మే నెలలో జరగబోయే లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శనివారం మంత్రితో పాటు వెంకటగిరి శాసనసభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ కూడా లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యక పూజలు నిర్వహించారు.
- Advertisement with us -