దిగుమతి సుంకాలపై ట్రంప్ క్లారిటీ..
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం వల్ల భారతీయ వాణిజ్య బంధం బలపడుతుందని వాదించే వారికి ట్రంప్ ఓ స్పష్టత ఇచ్చారు. దిగుమతి సుంకాలపై తన వైఖరిని కుండ బద్దలు కొట్టారు డానాల్డ్ ట్రంప్.. అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎక్కువ దిగుమతి సుంకం విధిస్తే తాము కూడా అంతే సుంకం విధిస్తామని క్లారిటీ ఇచ్చేశారు . భారత ప్రతీ విషయంలోనూ మాపై పన్నులు విధిస్తోంది.. కాబట్టి వారు మాకు టాక్సులు విధిస్తే మేం అంతకంతా విధించి బదులు తీర్చుకుంటామని అన్నారు. అమెరికా ఎగుమతి చేసే కొన్ని వస్తువులపై బ్రెజిల్, భారత్ చాలా అధిక సుంకాలు విధిస్తున్నాయని అన్నారు. చైనాతో ట్రేడ్ అగ్రిమెంట్ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు ఆయన ఈవిధంగా బదులిచ్చారు. భారత్ వంద శాతం సుంకాలు విధిస్తే మేం చూస్తూ ఊరుకోవాలా? ఇప్పటికే కొన్ని వస్తువులపై వందా, రెండొందల శాతం భారత్ సుంకాలు విధిస్తోంది. వారు సుంకాలు విధించ దలచుకుంటే.. ఓకే.. మేం కూడా అదే పని చేస్తాం అని మారలాగోలో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నారు.
మా ప్రభుత్వం విధానం అంతా స్పందన, ప్రతిస్పందన పైనే ఆధారపడి నడుస్తుందన్నారు.. ఎవరైనా మా పట్ల స్పందిస్తున్న తీరును బట్టే మేం కూడా ప్రతిస్పందిస్తాం అని ట్రంప్ టీమ్ లోని కామర్స్ సెక్రటరీ పిక్ హోవార్డ్ లుత్నిక్ కూడా కామెంట్ చేశారు.