27.5 C
Hyderabad
Monday, September 14, 2026

Live Video

spot_img

అంబేద్కర్ పై అమిత్ షా కామెంట్ల రచ్చ..

  • హోం మంత్రి రాజీనామాకు విపక్షాల పట్టు
  • రాహుల్, ఖర్గేలనుకలసిన మోడీ.. హోం మంత్రి

పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీలను కలిపింది. అంబేద్కర్ పై బీజేపి నేతల వివాదాస్పద వ్యాఖ్యల నేపధ్యంలో వివరణ ఇచ్చేందుకు ప్రధాని మోడీ, అమిత్ షా కాంగ్రెస్ నేతలను కలుసుకున్నారు..

రాజ్యాంగ రచనకు 75 వసంతాలు పూర్తయ్యాయన్న నేపధ్యంలో పార్లమెంటు ఉభయ సభలలోనూ జరుగుతున్న చర్చల్లో వాదోపవాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు బీజేపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఘాటు విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా హోం మంత్రి అమిత్ షా మరింత పదునైన కామెంట్లు చేయడంతో సభలో నిన్న రేగిన కల్లోలం ఇవాళ కూడా కంటిన్యూ అయ్యింది.

అంబేద్కర్ నినాదం ఫ్యాషన్ అయిపోయింది..

కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ .. అంబేద్కర్ అంటూ వందసార్లు నామ జపం చేస్తున్నారని, ఆయన పేరు తలవడం వారికి ఫ్యాషన్ గా మారిందని ఎద్దేవా చేశారు. అంతకన్నా భగవంతుడిని వంద సార్లు స్మరించి ఉంటే స్వర్గంలో కాస్త చోటయినా దక్కేదని కహోం మంత్రి అమిత్ షా ఎదురు దాడి చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలే కాదు, విపక్షాల నుంచి మూకుమ్మడి దాడి ఎక్కువైంది. అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారంటూ సభ్యులు ఆందోళనకు దిగారు. అమిత్ షా రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ఈ సమయంలో ప్రధాని మోడీ కల్పించుకుని అంబేద్కర్ పేరును అప్రతిష్ట పాల్చేస్తున్నది కాంగ్రెస్సేనని మండి పడ్డారు.. ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్ అవమానించిందని, వారిపట్ల ఘోర అన్యాయం చేసిందని మోడీ ఆరోపించారు. ఈ దశలో అధికార పక్ష నేత కిరణ్ రిజుజు కూడా కాంగ్రెస్ పై పదునైన విమర్శల దూకుడు పెంచారు.అంబేద్కర్ పై ఒత్తిడి పెట్టి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేయించిందని రిజిజు ఆరోపించారు.

మండిపడిన కాంగ్రెస్.. మోడీ, షా వివరణ..

అంబేద్కర్ అంశంపై లోక్ సభ అట్టుడికింది. కాంగ్రెస్ తన ఆందోళనను ముమ్మరం చేయడంతో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను వ్యక్తిగతంగా కలుసుకున్నారు. వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయతించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com