విశాఖపట్నంకు చెందిన ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్ధ విశాఖ డైరీ చైర్మన్ తో సహా డైరెక్టర్లు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి శుక్రవారం పంపించారు. విశాఖ డైరీ అభివృద్ధి కొరకు పూర్తి సమయాన్ని కేటాయించేందుకు ఆడారి ఆనంద్ కుమార్ వైకాపాకు రాజీనామా చేసినట్లు తెలిసింది. ఇదే రీతిలో డైరెక్టర్లుగా కొనసాగుతున్న 9 మంది వైఎస్సార్ పార్టీకి రాజీనామా చేశారు. విశాఖ డైరీ డైరెక్టర్లు శరగడం వరాహ వెంకట శంకర్రావు, పిల్లా రమా కుమారి, శీరంరెడ్డి సూర్యనారాయణ, కోళ్ల కాటమయ్య, దాడి పవన్ కుమార్, ఆరంగి రమణబాబు, చిటికెల రాజకుమారి, రెడ్డి రామకృష్ణ, సుందరపు ఈశ్వర్, పరదేశి గంగాధర్ లు తమ రాజీనామా లేఖలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించారు.
- Advertisement with us -