రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.. శాసనమండలి ప్రాంగణంలో ఉమ్మడి రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ శాసనసభ్యులు, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ మదన గోపాల్‌ను ఆత్మీయంగా పలకరించారు. ఆ సమయంలో శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్, బస్వరాజు సారయ్య, రఘోత్తం రెడ్డి కూడా కలిశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం లో కలిసి పనిచేసిన అనుభవాలను మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ గార్లతో పాటు శాసనమండలి సభ్యులతో కలిసి పంచుకున్నారు. కాసేపు ఆహ్లాదంగా ముచ్చటించుకున్నారు. ఈ ఆసక్తికర పరిణామానికి శాసనమండలి ప్రాంగణం వేదికైంది.
- Advertisement with us -