23.3 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

టెస్ట్‌ క్రికెట్‌ కు విరాట్‌ కోహ్లీ గుడ్‌ బై

అందరూ అనుకున్నట్లే అయ్యింది… రోహిత్‌ శర్మ దారిలోనే విరాట్‌ కోహ్లీ కూడా అడుగులు వేస్తున్నాడు. టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాట్స్‌ మెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పేశారు. సోమవారం సోషల్‌ మీడియా ద్వారా కోహ్లీ ఈ విషయాన్ని ప్రకటించారు. తన ఎక్స్‌ ఖాతాలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తాను టెస్ట్‌ క్రికెట్‌ లో మొదటిసారి బ్యాగీ డ్లూ ధరించి 14 సంవత్సరాలు అయ్యిందని పేర్కొన్నారు. వాస్తవంగా చెప్పాలంటే టెస్ట్‌ క్రికెట్‌ ఫార్మెట్‌ లో ఇన్ని సంవత్సరాలు నేను కొనసాగగలనని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. టెస్ట్‌ క్రికెట్‌ నన్ను పరీక్షించిందని, వ్యక్తిగా తీర్చిదిద్దిందని, నాకు జీవితంలో ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే ఎన్నో పాఠాలను టెస్ట్‌ క్రికెట్ ద్వారా నేర్చుకున్నానన్నారు. నా కెరీర్‌ లో శ్వేత జాతీయులతో టెస్ట్‌ క్రికెట్‌ ఆడటం వ్యక్తిగతంగా నాకు సంతృప్తినిచ్చిందన్నారు. నిశ్శబ్దమైన మైదానాల్లో అనేక రోజుల పాటు ఆడిన ఆ క్షణాలు నాతో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. టెస్ట్‌ ఫార్మెట్‌ నుంచి వైదొలగాలి అనుకున్నప్పుడు ఈ నిర్ణయం అమలు చేయడం అంత శులభమైన విషయం కాదనిపించింది కానీ వైదొలగడం సరై నిర్ణయమే అన్నారు విరాట్‌ కోహ్లీ. నా శక్తి మేరకు భారత్‌ తరపున టెస్ట్‌ మ్యాచ్‌ లు ఆడాను నేను ఆశించినదాని కంటే నాకు టెస్ట్‌ క్రికెట్‌ చాలా ఇచ్చింది అని విరాట్‌ కోహ్లీ గతాన్నంతా నెమరువేసుకున్నారు. టెస్ట్‌ క్రికెట్‌ పట్ల అత్యంత కృతజ్ఞతా భావం నిండిన హృదయంతో వెళుతున్నానన్నారు. నాకు పద్నాలుగేళ్ళ టెస్ట్‌ క్రికెట్‌ కెరీర్‌ లో నాతో పాటు మైదనం పంచుకున్న వ్యక్తులు, నా ఆటను చూసి నన్ను అభిమానించి ప్రోత్సహించిన అభిమానులకు ఎప్పటికీ నేను కృతజ్ఞతతో ఉంటానని విరాట్‌ కోహ్లీ తన ఎక్స్‌ ఖాతాలో టెస్ట్‌ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నానంటూ భావోద్వేగం నిండిన పోస్ట్‌ పెట్టారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com